Aroori Ramesh : నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్

వరంగల్ లోక్ సభకు పోటీ చేయాలని అనుకుంటున్న ఆరూరి రమేశ్.. బీఆర్ఎస్ వీడి బీజేపీలో చేరతారని వారం పది రోజులుగా ప్రచారం జరుగుతోంది.

Aroori Ramesh

Aroori Ramesh : వరంగల్ లో రాజకీయం వేడెక్కింది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పార్టీ మార్పు పై హైడ్రామా నెలకొంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో రమేశ్ సమావేశం అయ్యారు. కేసీఆర్ తో భేటీ తర్వాత.. తాను పార్టీ మారడం లేదని రమేశ్ చెప్పారు. అంతేకాదు.. తనన ఎవరూ కిడ్నాప్ చేయలేదని, పార్టీ నేతలతో కలిసి కేసీఆర్ నివాసానికి వచ్చానని ఆరూరి రమేశ్ వెల్లడించారు. తాను అమిత్ షాతోనూ సమావేశం కాలేదని, తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని ఆరూరి రమేశ్ స్పష్టం చేశారు.

అంతకుముందు రమేశ్ ను ప్రెస్ మీట్ నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్యలోనే తీసుకొచ్చారు. అయితే, బీజేపీ నేతలు కారుని అడ్డుకుని రమేశ్ ను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆరూరి రమేశ్ చొక్కా చిరిగిపోయింది.

మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యతో కలిసి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కేసీఆర్ నివాసానికి వెళ్లారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం కేసీఆర్ చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్న కేసీఆర్.. అభ్యర్థులను ఖరారు చేస్తూ వస్తున్నారు. అయితే, ఈ ఉదయం ఆరూరి రమేశ్ విషయంలో హైడ్రామా చోటు చేసుకుంది. వరంగల్ లో జరిగిన పరిణామాలు అంచనా వేసిన బీఆర్ఎస్ పార్టీ.. వెంటనే పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. వరంగల్ నియోజకవర్గ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేతలు అందరూ హాజరయ్యారు.

తనను ఎవరూ కిడ్నాప్ చేయాలని, తాను ఎర్రబెల్లి దయాకర్ రావు, పార్టీ నేతలతో కలిసి కేసీఆర్ నివాసానికి వచ్చినట్లు వెల్లడించారు. ఆరూరి రమేశ్ నిన్న అమిత్ షాను కలిసే ప్రయత్నం చేయడంతో ఆయన బీజేపీలోకి వెళ్తున్నారన్న ప్రచారం జోరుగా జరిగింది. దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. తాను అమిత్ షాను కలవలేదన్నారు. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని తేల్చి చెప్పారు.

వరంగల్ లోక్ సభకు పోటీ చేయాలని అనుకుంటున్న ఆరూరి రమేశ్.. బీఆర్ఎస్ వీడి బీజేపీలో చేరతారని వారం పది రోజులుగా ప్రచారం జరుగుతోంది. గతంలో పార్టీ కీలక నేతలు ఓసారి ఆరూరి రమేశ్ ను బుజ్జగించారు. బీఆర్ఎస్ ను వీడకుండా చర్యలు చేపట్టారు. తాజాగా ఆరూరి రమేశ్ మరోసారి బీఆర్ఎస్ నేతలతో టచ్ లోకి వెళ్లారు అనే ప్రచారంతో పార్టీ అలర్ట్ అయ్యింది. అయితే, ఆరూరి రమేశ్ బీఆర్ఎస్ లో కొనసాగుతారా? బీజేపీలోకి వెళ్తారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Also Read : రేవంత్ రెడ్డిని దింపాలని కాంగ్రెస్ వాళ్లే అనుకుంటున్నారు..! సైదిరెడ్డి టెలికాన్ఫరెన్స్ వాయిస్ రికార్డు వైరల్

ట్రెండింగ్ వార్తలు