Saidireddy : రేవంత్ రెడ్డిని దింపాలని కాంగ్రెస్ వాళ్లే అనుకుంటున్నారు..! సైదిరెడ్డి టెలికాన్ఫరెన్స్ వాయిస్ రికార్డు వైరల్

బీఆర్ఎస్ పరిస్థితి అర్థం కావడం లేదు. రంజిత్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి వంటివారు పోటీ చేయడం లేదంటూ టెలీకాన్ఫరెన్స్ లో సైదిరెడ్డి పేర్కొన్నారు.

Saidireddy : రేవంత్ రెడ్డిని దింపాలని కాంగ్రెస్ వాళ్లే అనుకుంటున్నారు..! సైదిరెడ్డి టెలికాన్ఫరెన్స్ వాయిస్ రికార్డు వైరల్

Ex MlA Saidireddy

Ex MlA Saidireddy Teleconference Voice Record : హుజూర్ నగర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి టెలికాన్ఫరెన్స్ వాయిస్ రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల ఆయన బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా, నేరేడుచర్ల తన మద్దతుదారులతో టెలీకాన్ఫరెన్స్ లో సైదిరెడ్డి మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఆడియో రికార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఆడియోలో సైదిరెడ్డి మాట్లాడుతూ.. పార్టీ మార్పు, బీజేపీలో చేరిపై తన క్యాడర్ కు సర్దిచెప్పుకున్నారు. బీఆర్ఎస్ నుంచి పోటీచేసినా అవతలి వారికి మన నేతలే మద్దతు ఇస్తారంటూ బీఆర్ఎస్ కీలక నేతలపై సైదిరెడ్డి విమర్శలు చేశారు. ఢిల్లీ రావాలని బీజేపీ ముఖ్య నేతల నుంచి పిలుపు రావటంతో వెళ్లగా.. అక్కడున్న బీజేపీ పెద్దలు కండువా కప్పుకోవాలని సూచించారని, ఎంపీ టికెట్ నీకే వస్తుంది.. ఇప్పుడు కండువా కప్పుకోకుంటే పార్టీ పరువు పోతుందని చెప్పారు. మీరంతా నా వెంటే ఉంటారు.. నన్ను అర్థం చేసుకుంటారని నేను అప్పటికప్పుడు బీజేపీలో చేరడం జరిగిందని సైదిరెడ్డి తన క్యాడర్ వద్ద పేర్కొన్నారు.

Also Read : Jagga Reddy : మెదక్ పార్లమెంట్ నుంచి పోటీచేసేందుకు నా భార్యకు అవకాశం ఇవ్వండి : జగ్గారెడ్డి

కేంద్రంలో మళ్లీ బీజేపీనే వస్తుంది.. మోదీనే ప్రధాని అవుతారు. ఇన్నాళ్లు చరిత్రలో ఇంత క్లీన్ ఇమేజ్ ఉన్న మోదీలాంటి నాయకుడు లేరు. ఒక్క స్కాం లేదు. ఆయనకు కుటుంబం లేదు.. దేశమే ఆయనకు కుటుంబం. ఆయన సంపోర్టు ఉంటే మనకు మంచి జరుగుతుందనే ఆలోచనలో ఉన్నాను. ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి అర్థం కావడం లేదు. ఎన్నికలప్పుడు డబ్బులు ఇవ్వకుండా అవతల వారికి ఇస్తే ఎలా పనిచేస్తాం. రంజిత్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి వంటివారు పోటీ చేయడం లేదంటూ టెలీకాన్ఫరెన్స్ లో సైదిరెడ్డి పేర్కొన్నారు. అంతేకాక.. సీఎం రేవంత్ రెడ్డిని దింపాలని కాంగ్రెస్ వాళ్లే అనుకుంటున్నారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలే వెళ్లి సీఎం రేవంత్ కు సహాయం చేసే అవకాశం ఉంది.

Also Read : వాహనాల రిజిస్ట్రేషన్ మార్క్‌ను టీఎస్ నుంచి టీజీకి మార్చుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ

రాష్ట్రంలో బీజేపీకి ఛాన్స్ ఉంది. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ తెలంగాణలో 12 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. పార్టీ మరినందుకు క్షమించండి.. జై తెలంగాణ అంటూ తన మద్దతు దారులతో సైదిరెడ్డి టెలీకాన్ఫరెన్స్ లో సంభాషణ ముగించారు. ప్రస్తుతం ఆ టెలీకాన్ఫరెన్స్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.