Ktr On Kavitha Arrest : ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై స్పందించిన కేటీఆర్.. ఏమన్నారంటే..

ఈడీ స్వయంగా సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని (అండర్ టేకింగ్) ను తుంగలో తొక్కి ఈరోజు అరెస్టు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని కేటీఆర్ అన్నారు.

Ktr On Kavitha Arrest : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎక్స్ వేదికగా ఆయన రియాక్ట్ అయ్యారు. పదేళ్ల బీజేపీ పాలనలో రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యల కోసం అధికార దుర్వినియోగం, రాజ్యాంగ వ్యవస్థల దురుపయోగం చేయడం సర్వసాధారణంగా మారిందని మండిపడ్డారు. ఈరోజు ఈడీ ప్రదర్శించిన తొందరపాటు దుందుడుకు చర్యలపై సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. కవిత అరెస్ట్ విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఈడీ వ్యవహరించిన తీరుపై రేపు సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు కేటీఆర్.

కచ్చితంగా 19వ తేదీన జరిగే సుప్రీంకోర్టు విచారణలో ఈ అంశం పరిగణలోకి వస్తుందని ఆయన ఆశించారు. ఈడీ స్వయంగా సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని (అండర్ టేకింగ్) ను తుంగలో తొక్కి ఈరోజు అరెస్టు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని కేటీఆర్ అన్నారు. కచ్చితంగా న్యాయం గెలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా ఈ అంశంలో పోరాటం కొనసాగిస్తామని ఎక్స్ లో తెలిపారు.

Also Read : కవిత అరెస్ట్.. తర్వాత ఏం జరగనుంది? సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రియాక్షన్