Amit shah slams nitish kumar: ఇలాగైతే నితీశ్ బాబు దేశ ప్రధాని ఎలా కాగలరు?: అమిత్ షా

‘‘రాజకీయ కూటములను మార్చడం ద్వారా నితీశ్ బాబు ప్రధానమంత్రి కాగలరా? రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి ఆయన చాలా మందిని మోసం చేశారు. లాలూ జీ.. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నితీశ్ బాబు రేపు మిమ్మల్ని వెనక్కి నెట్టి కాంగ్రెస్ తో దోస్తీ కట్టే అవకాశమూ ఉంది’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. కాగా, ఎన్డీఏ నుంచి వైదొలిగిన నితీశ్ కుమార్ బిహార్ లో ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జాతీయ రాజకీయాలపై ఆయన దృష్టి సారించారు.

Amit shah slams nitish kumar: ‘‘రాజకీయ కూటములను మార్చడం ద్వారా నితీశ్ బాబు ప్రధానమంత్రి కాగలరా?’’ అని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా ప్రశ్నించారు. దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేస్తున్న బిహార్ సీఎం నితీశ్ కుమార్ కు ఎటువంటి సిద్ధాంతమూ లేదని, 2024 లోక్ సభ ఎన్నికల్లో బిహార్ లోని మహాఘట్‌బంధన్ ఓడిపోతుందని అన్నారు. బిహార్ లోని పూర్ణియా జిల్లాలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు.

2014 లోక్ సభ ఎన్నికలకు ముందు నితీశ్ కుమార్ పార్టీకి కేవలం 2 సీట్లు మాత్రమే ఉన్నాయని అమిత్ షా అన్నారు. 2024 ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ ను బిహార్ ప్రజలు చిత్తుగా ఓడిస్తారని చెప్పారు. అలాగే, 2025 బిహార్ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీతో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని అన్నారు.

‘‘రాజకీయ కూటములను మార్చడం ద్వారా నితీశ్ బాబు ప్రధానమంత్రి కాగలరా? రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి ఆయన చాలా మందిని మోసం చేశారు. లాలూ జీ.. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నితీశ్ బాబు రేపు మిమ్మల్ని వెనక్కి నెట్టి కాంగ్రెస్ తో దోస్తీ కట్టే అవకాశమూ ఉంది’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. కాగా, ఎన్డీఏ నుంచి వైదొలిగిన నితీశ్ కుమార్ బిహార్ లో ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జాతీయ రాజకీయాలపై ఆయన దృష్టి సారించారు.

National Herald Case : తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు .. అక్టోబర్ 10న విచారణకు రావాలని ఆదేశాలు

ట్రెండింగ్ వార్తలు