National Herald Case : తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు .. అక్టోబర్ 10న విచారణకు రావాలని ఆదేశాలు

ఓపక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్..మరోపక్క నేషనల్ హెరాల్డ్ కేసులు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అధికారపార్టీ నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది.

National Herald Case : తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు .. అక్టోబర్ 10న విచారణకు రావాలని ఆదేశాలు

ED notices to Telangana Congress leaders

ED notices to Telangana Congress leaders : ఓపక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్..మరోపక్క నేషనల్ హెరాల్డ్ కేసులు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అధికారపార్టీ నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈక్రమంలో నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 10న విచారణకు రావాలని ఈడీ తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొంతమందికి నోటీజులు జారీ చేసింది. ఈడీ నోటీసులు జారీ చేసినవారిలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ,సుదర్శన్ రెడ్డి, గీతారెడ్డి,అంజన్ కుమార్ లు ఉన్నారు. తమకు ఈడీ నోటీసులు అందినమాట నిజమేనని షబ్బీర్ అలీ స్పష్టంచేశారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. మనీలాండరింగ్ యాక్ట్ 50 కింద నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. అక్టోబర్ 10న ఢిల్లీకి విచారణకు రావాలని ఆదేశించింది. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి గీతారెడ్డి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. వీళ్లంతా నేషనల్ హెరాల్డ్ కు నిధులు సమకూర్చారని ఈడీకి గుర్తించిందని తెలుస్తోంది.

కాగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. అలాగే మల్లిఖార్జున ఖర్గే, పవన్ బన్సల్ లను కూడా ఈడీ విచారించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో తనకు ఈడీ నోటీసులు వచ్చాయన్న వార్తలపై మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పందించారు. తనకు ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. అయితే పత్రిక నడపడానికి కొంత ఫండ్ మాత్రం తాను ఇచ్చానని షబ్బీర్ అలీ అంగీకరించారు. ఈడీ నోటీసులు వస్తే విచారణకు హాజరవుతానని తెలిపారు. యంగ్ ఇండియన్ లిబిటెడ్ కంపెనీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆర్థిక లావాదేవీలను ఈడీ అధికారులు గుర్తించారు.