Ys Viveka : పులివెందులలో సీబీఐ.. మరోసారి వివేకా ఇంటికెళ్లి హత్య జరిగిన ప్రదేశం పరిశీలన.. అసలేం జరుగుతోంది?

Ys Viveka: వివేకా హత్య జరిగిన రోజున ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? అనే దానిపై ఆరా తీశారు. హత్య జరిగిన రోజు వివేకా పార్థివదేహాన్ని ముందుగా ఫొటోలు, వీడియోలు తీసి ఆయన కుటుంబసభ్యులకు పంపారు ఇనాయతుల్లా.

Ys Viveka

Ys Viveka : కడప జిల్లా పులివెందులలో మాజీమంత్రి వివేకానంద రెడ్డి ఇంటిని సీబీఐ అధికారులు మరోసారి క్షుణ్ణంగా పరిశీలించారు. వివేకా హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అలాగే, గతంలో వివేకా వద్ద కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసిన ఇనాయతుల్లాను సీబీఐ అధికారులు విచారించారు.

వివేకా ఇంటి వద్దే కారులోనే ఇనాయతుల్లాను ప్రశ్నించారు అధికారులు. వివేకా హత్య జరిగిన రోజున ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? అనే దానిపై ఆరా తీశారు. హత్య జరిగిన రోజు వివేకా పార్థివదేహాన్ని ముందుగా ఫొటోలు, వీడియోలు తీసి ఆయన కుటుంబసభ్యులకు పంపింది ఇనాయతుల్లానే. దాంతో ఇనాయతుల్లాను విచారించారు అధికారులు. అటు, ఎంపీ అవినాశ్ రెడ్డి ఇంటికి కూడా సీబీఐ అధికారులు వెళ్లారు.

Also Read..Gannavaram Politics: వల్లభనేని వర్సెస్ చింతమనేని.. మాటల యుద్ధంతో హీటెక్కిన గన్నవరం పాలిటిక్స్

మాజీమంత్రి వివేకా కేసులో దర్యాఫ్తును ముమ్మరం చేశారు సీబీఐ అధికారులు. ఈ కేసులో ఇప్పటికే పలువురుని అరెస్ట్ చేశారు. ఎంపీ అవినాశ్ రెడ్డిని పలుమార్లు విచారించారు. నిన్న వివేకా అల్లుడిని కూడా సీబీఐ బృందం విచారించిన సంగతి తెలిసిందే.

మరోవైపు సీబీఐ అధికారులు పులివెందులకు వెళ్లారు. వివేకా ఇంటి పరిసర ప్రాంతాలను కాసేపు పరిశీలించారు. ఆ తర్వాత ఎంపీ అవినాశ్ ఇంటికి కూడా వెళ్లారు. అక్కడా కాసేపు పరిశీలించారు. ఆ తర్వాత మరోసారి వివేకా ఇంటికి చేరుకున్న సీబీఐ బృందం.. గతంలో వివేకా దగ్గర కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసిన ఇనాయతుల్లాను పిలిపించుకున్నారు. అతడిని కారులోనే విచారించారు.

Also Read..YS Viveka Case : 10టీవీ చేతిలో దస్తగిరి సీబీఐ అధికారులకు ఇచ్చిన 160 CRPC స్టేట్‌మెంట్ కాపీ..

వివేకా హత్య జరిగిన రోజున సంఘటనా స్థలానికి తొలుత వచ్చింది ఇనాయతుల్లానే. ఆ ప్రదేశంలో వీడియోలు, ఫోటోలు తీసింది కూడా అతడే. వాటిని ఎవరెవరికి పంపాడు? వివేకా కుటుంబసభ్యులకే పంపాడా? మరెవరికైనా పంపాడా? అనే కోణంలో ఇనాయతుల్లాను సీబీఐ విచారించింది.