బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుపై మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

నా కుమారుడుకి టికెట్ ఇస్తే కుటుంబం అని ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారాయన. ఇక, తన యూనివర్సిటీల్లో అక్రమ కట్టడాలు ఉంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చన్నారు మల్లారెడ్డి.

Ch Malla Reddy Sensational Comments On BJP BRS Parties Alliance

Ch Malla Reddy : తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. పార్లమెంటు ఎన్నికల వేళ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రాజకీయాల్లో హీట్ పెంచాయి. ఇక బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే బీజేపీ కీలక నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. తాజాగా మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ లో మాజీమంత్రి చామకూర మల్లారెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. బీజేపీతో పొత్తు, మల్కాజ్ గిరి టికెట్ అంశంపై ఆయన ఓపెన్ అయ్యారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటే మా ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని బండి సంజయ్ ఎందుకు మాట్లాడతారని మల్లారెడ్డి ప్రశ్నించారు. బండి సంజయ్ తో అయ్యేది లేదు, పొయ్యేది లేదన్నారు మల్లారెడ్డి. మల్కాజిగిరి టిక్కెట్ భద్రంగా ఉందన్న ఆయన.. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉన్నా మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం మాదే అని తేల్చి చెప్పారు.

Also Read : వారు బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లకుండా ఉండడానికే కేసీఆర్ ఇలా చేస్తున్నారు: బండి సంజయ్

నా అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కుటుంబం వేరు, నా కుటుంబం వేరు అని మల్లారెడ్డి చెప్పారు. నా కుమారుడుకి టికెట్ ఇస్తే కుటుంబం అని ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారాయన. ఇక, తన యూనివర్సిటీల్లో అక్రమ కట్టడాలు ఉంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చన్నారు మల్లారెడ్డి. ప్రభుత్వం కక్ష సాధించాలనుకుంటే నేను ఏమీ చేయలేను అని వాపోయారు మల్లారెడ్డి.

”బండి సంజయ్ తో అయ్యేదీ లేదు, పొయ్యేదీ లేదు. ఒకవేళ బీజేపీతో పొత్తు ఉన్నా.. మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ బీఆర్ఎస్ కే. మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ భద్రంగా ఉంది. నా కొడుకు భద్రారెడ్డికే వస్తుంది. నా కొడుక్కి టికెట్ ఇస్తే కుటుంబానికి ఇచ్చారని అనడం కరెక్ట్ కాదు. నా అల్లుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కుటుంబం వేరు, మా కుటుంబం వేరు” అని తేల్చి చెప్పారు మల్లారెడ్డి.

కాగా.. 8మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారంటూ బీజేపీ కీలక నేత బండి సంజయ్ బాంబు పేల్చారు. అంతేకాదు లోక్ సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని ఆయన తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ తో మాకు పొత్తు లేదు, కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారు అని విరుచుకుపడ్డారు బండి సంజయ్.

Also Read : గొర్రెల పంపిణీ పథకంలో అవినీతి.. స్కామ్‌లు చేసేవారికే దిమ్మతిరిగే స్కామ్ ఇది

 

ట్రెండింగ్ వార్తలు