పవన్ కల్యాణ్‌కు సీఎం పదవి ఇస్తానని చంద్రబాబు ప్రకటించగలరా? చేగొండి హరిరామజోగయ్య కీలక వ్యాఖ్యలు

ఇప్పుడు వరకు రాష్ట్రంలో 8శాతం జనాభా ఉన్న రెడ్డి కులస్తులు, 4శాతం జనాభా ఉన్న కులస్తులు మాత్రమే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.

Chegondi Venkata Harirama Jogaiah

Chegondi Venkata Harirama Jogaiah : కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరి రామ జోగయ్య మూడు పేజీల లేఖ విడుదల చేశారు. జనసేన-టీడీపీ మధ్య జనాభా నిష్పత్తిలో అసెంబ్లీ సీట్ల షేరింగ్ జరుగుతున్నాయా? అని ఆయన ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలకు సీట్ల కేటాయింపు ద్వారా రాజ్యాధికారం దక్కబోతుందా? అడి అడిగారు. సామాజిక న్యాయం జరగబోతుందా? అంటూ లేఖాస్త్రం సంధించారు హరిరామజోగయ్య.

”నాకు పదవులపై ఆశ లేదు. గెలిచే సీట్లు తీసుకుంటాం అంటూ పవన్ కల్యాణ్ చెబుతుంటే.. 27 సీట్లు అని 30 సీట్లు అని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో 31 మంది కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు వరకు రాష్ట్రంలో ఎనిమిది శాతం జనాభా ఉన్న రెడ్డి కులస్తులు, నాలుగు శాతం జనాభా ఉన్న కులస్తులు మాత్రమే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.

Also Read : టీడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థులు వీళ్లేనా?

ఒక్క దామోదరం సంజీవయ్య తప్ప ఇంకెవరూ రాజ్యాధికారం చేపట్లేదు. రాష్ట్రంలో 25శాతం జనాభా కలిగిన కాపు సామాజికవర్గంతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకుని బడుగులకు రాజ్యాధికారం సాధ్యమయ్యేందుకు కృషి చేయాలి. పవన్ కల్యాణ్ కు రెండున్నర సంవత్సరాలు సీఎం పదవి ఇస్తానని చంద్రబాబు నోటి నుండి ప్రకటించగలరా? ఓటు షేరింగ్ సవ్యంగా జరగాలంటే సీట్ల షేరింగ్ కూడా ముఖ్యమే” అని లేఖలో పేర్కొన్నారు హరిరామజోగయ్య.

Also Read : వైసీపీ ఏడో జాబితాపై ఉత్కంఠ.. టెన్షన్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలు

 

ట్రెండింగ్ వార్తలు