YCP Second List With 27 Members
YCP Second List : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీలో ఇంఛార్జ్ లను మార్చేస్తున్నారు సీఎం జగన్. అసెంబ్లీ, లోక్ సభ స్థానాల ఇంఛార్జ్ లను మారుస్తున్నారు. ఇటీవల 11 నియోజకవర్గాలకు ఇంఛార్జిలను మారుస్తూ తొలి జాబితా విడుదల చేసిన వైసీపీ అధినాయకత్వం.. తాజాగా మరికొన్ని అసెంబ్లీ, లోక్ సభ స్థానాల ఇంఛార్జిల నియామకాలకు సంబంధించి రెండో జాబితా విడుదల చేసింది. 27 నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జీలను నియమించారు జగన్. పలువురు ఎంపీలను అసెంబ్లీ నియోజకవర్గాలకు పంపించారు జగన్.
ఐదుగురు వారసులకు అవకాశం..
ఇప్పటివరకు 38 స్థానాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు చేశారు జగన్. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27 మంది ఇంఛార్జిలను మార్చేశారు. రెండో జాబితాను పరిశీలిస్తే ఐదుగురు వారసులకు అవకాశం కల్పించారు. వీరిలో నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా పేర్నినాని కుమారుడు కృష్ణమూర్తి, చంద్రగిరి అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, తిరుపతి అభ్యర్థిగా భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె ఫాతిమాకు, పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాశ్ కు (రామచంద్రపురం) అవకాశం ఇచ్చారు జగన్. ఇక, విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణు స్థానంలో వెల్లంపల్లి శ్రీనివాస్ కు చోటు కల్పించారు.
Also Read : షర్మిల నిర్ణయంతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
ఎమ్మెల్యేలుగా బరిలోకి ముగ్గురు ఎంపీలు..
అరకు ఎంపీగా ఉన్న గొడ్డేటి మాధవి అరకు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీత పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు.
టికెట్ కోల్పోయిన 8 మంది సిట్టింగ్ లు..
సెకండ్ లిస్ట్ లో మొత్తం 8 మంది సిట్టింగ్ లు టికెట్ కోల్పోయారు. వీరిలో ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు. వీరంతా తమ స్థానాలను పూర్తిగా కోల్పోయారు. వచ్చే ఎన్నికల్లో దాదాపుగా పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. కోనసీమకు చెందిన పి.గవన్నరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, కాకినాడ జిల్లాకు సంబంధించి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, ప్రత్తిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మిగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడ అమర్నాథ్ వీళ్లంతా పూర్తిగా వాళ్ల స్థానాలను కోల్పోయారు. హిందూపూరం ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ తన స్థానాన్ని కోల్పోయారు. గోరంట్ల మాధవ్ స్థానంలో కొత్తగా ఇవాళే(జనవరి 2) పార్టీలో చేరిన శాంతమ్మను హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు జగన్.
విజయవాడ వెస్ట్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ స్థానంలో షేక్ ఆసిఫ్ కు ఛాన్స్ ఇచ్చారు. అనకాపల్లి అభ్యర్థిగా మంత్రి గుడివాడ అమర్నాథ్ స్థానంలో మలసాల భరత్ కుమార్ ను ప్రకటించారు జగన్. కాగా, గుడివాడ అమర్ నాథ్ అభ్యర్థిత్వాన్ని పెండింగ్ లో ఉంచారు జగన్. మొత్తంగా 8మంది సిట్టింగ్ లకు షాక్ ఇచ్చారు జగన్. 11 మంది కొత్త వాళ్లకు అవకాశం కల్పించారు. ఐదుగురు వారసులను ఇంఛార్జిలుగా నియమించారు.
వైసీపీ విడుదల చేసిన రెండో జాబితాలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ముస్లిం మైనార్టీలను ఇంఛార్జ్ లుగా ప్రకటించారు జగన్. గుంటూరు ఈస్ట్ ఇంఛార్జ్ గా షేక్ నూరి ఫాతిమా, విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్, కదిరి ఇంఛార్జిగా బీఎస్ మక్బూల్ అహ్మద్ లను నియమించింది. వచ్చే ఎన్నికల్లో వీరి అభ్యర్థిత్వాన్నే వైసీపీ ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నలుగురు చొప్పున ఎస్సీ, ఎస్టీ ఇంఛార్జ్ లను సమన్వయకర్తలుగా ప్రకటించారు జగన్.
Also Read : గోరంట్ల మాధవ్‌కు నిరాశ..! హిందూపురం ఇంఛార్జ్‌గా మహిళకు సీఎం జగన్ అవకాశం
వైసీపీ రెండో జాబితా – అనంతపురం జిల్లా
అనంతపురం ఎంపీ- శంకర నారాయణ (పెనుకొండ ఎమ్మెల్యే)
హిందూపురం ఎంపీ – శాంత (మాజీ ఎంపీ)
కదిరి అసెంబ్లీ నియోజకవర్గం – మక్బూల్ అహ్మద్
పెనుకొండ – ఉష శ్రీ చరణ్ (కల్యాణదుర్గం ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి)
కళ్యాణదుర్గం – తలారి రంగయ్య (అనంతపురం ఎంపీ)
ఏలూరు
పోలవరం (ఎస్టీ) అసెంబ్లీ నియోజవర్గ ఇంఛార్జిగా తెల్లం రాజ్యలక్ష్మి
పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు భార్య రాజ్యలక్ష్మికి సీటు ఖరారు
దొరమామిడి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న తెల్లం రాజ్యలక్ష్మి
ఉమ్మడి కృష్ణా జిల్లాలో మూడు స్థానాల్లో మార్పులు జరిగాయి. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు టికెట్ నిరాకరించారు. ఇక, సెంట్రల్ స్థానం బాధ్యతలను వెల్లంపల్లి శ్రీనివాస్ కి అప్పగించారు. వెల్లంపల్లి ప్రాతినిధ్యం వహించే విజయవాడ వెస్ట్ కు కొత్త అభ్యర్థిని ప్రకటించారు జగన్. విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ఇంఛార్జి బాధ్యతలను మాజీ కార్పొరేటర్ ఆసిఫ్ కు అప్పగించారు. బందరులో మాజీమంత్రి పేర్నినాని తనయుడు పేర్ని కృష్ణమూర్తికి ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు.
Also Read : వైసీపీలో జగన్ భారీ మార్పులు.. 27మందితో రెండో జాబితా విడుదల
27 మందితో వైసీపీ ఇంఛార్జిల సెకండ్ లిస్ట్..
అనంతపురం ఎంపీ – శంకరనారాయణ
హిందూపురం ఎంపీ – జోలదరాశి శాంత
అరకు ఎంపీ (ఎస్టీ) – కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి
రాజాం ఎస్సీ – తాలె రాజేశ్
అనకాపల్లి – మలసాల భరత్ కుమార్
పాయకరావు పేట (ఎస్సీ) – కంబాల జోగులు
రామచంద్రపురం – పిల్లి సూర్యప్రకాశ్
పి.గన్నవరం (ఎస్సీ) – విప్పర్తి వేణుగోపాల్
పిఠాపురం – వంగ గీత
జగ్గంపేట – తోట నరసింహం
ప్రత్తిపాడు – వరుపుల సుబ్బారావు
రాజమండ్రి సిటీ – మార్గాని భరత్
రాజమండ్రి రూరల్ – చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
పోలవరం (ఎస్టీ) – తెల్లం రాజ్యలక్ష్మి
కదిరి – మక్బూల్ అహ్మద్
ఎర్రగొండపాలెం (ఎస్సీ) – తాటిపర్తి చంద్రశేఖర్
ఎమ్మిగనూర్ – మాచాని వెంకటేశ్
తిరుపతి – భూమన అభినయ్ రెడ్డి
గుంటూరు ఈస్ట్ – షేక్ నూరి ఫాతిమా
మచిలీపట్నం – పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)
చంద్రగిరి – చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
పెనుకొండ – ఉషా శ్రీ చరణ్
కల్యాణదుర్గం – తలారి రంగయ్య
అరకు (ఎస్టీ) – గొడ్డేటి మాధవి
పాడేరు (ఎస్టీ) – మత్స్యరాస విశ్వేశ్వర రాజు
విజయవాడ సెంట్రల్ – వెల్లంపల్లి శ్రీనివాస రావు
విజయవాడ వెస్ట్ – షేక్ ఆసిఫ్
14 మంది సిట్టింగ్ లు ఔట్.
1. జ్యోతుల చంటి బాబు, 2. పర్వత ప్రసాద్, 3. పెండం దొరబాబు, 4. కొండేటి చిట్టిబాబు, 5. మల్లాది విష్ణు, 6. చెన్నకేశవ రెడ్డి, 7. గుడివాడ అమర్నాథ్, 8. సుధాకర్ బాబు, 9. ఆర్కే, 10. తిప్పల నాగిరెడ్డి, 11. మద్దాల గిరి, 12. శిద్దారెడ్డి, 13. గొల్ల బాబూరావు, 14. గోరంట్ల మాధవ్