గోరంట్ల మాధవ్‌కు షాక్..! హిందూపురం ఎంపీ అభ్యర్థిగా మహిళకు సీఎం జగన్ అవకాశం
పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించారు. కొత్త వారికి అవకాశం ఇచ్చారు. కొన్ని చోట్ల ఎంపీ అభ్యర్థులను కూడా మార్చేశారు జగన్.

Gorantla Madhav
Gorantla Madhav : వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం జగన్. ఇందులో భాగంగా పార్టీలో మార్పులకు శ్రీకారం చుట్టారు. పలు స్థానాల్లో ఇప్పటికే మార్పులు చేశారు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించారు. కొత్త వారికి అవకాశం ఇచ్చారు. కొన్ని చోట్ల ఎంపీ అభ్యర్థులను కూడా మార్చేశారు జగన్. కాగా, అనంతపురం జిల్లా విషయానికి వస్తే.. హిందూపురం ఎంపీ అభ్యర్థిని మార్చేశారు జగన్. అక్కడ ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్ కు షాక్ ఇచ్చారు జగన్.
గోరంట్ల మాధవ్ ఎంపీగా ఉన్న హిందూపురం లోక్ సభ నియోజకవర్గానికి మహిళను ఇంఛార్జ్ గా ప్రకటించారు జగన్. హిందూపురం వైసీపీ ఇంఛార్జిగా బళ్లారి బీజేపీ మాజీ ఎంపీ శాంతను నియమించారు జగన్. హిందూపురం ఎంపీ స్థానం నుంచి గోరంట్ల మాధవ్ కు బదులు ఇవాళే పార్టీలో చేరిన జె శాంతకు (జోలదరాశి శాంత) అవకాశం ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈసారి హిందూపురం వైసీపీ అభ్యర్థిగా శాంతమ్మ పోటీ చేయనున్నారు. దీంతో గోరంట్ల మాధవ్ కు మొండిచేయి చూపించినట్లు అయ్యింది. అయితే మరో లిస్టులో మరో చోటు నుంచి గోరంట్ల మాధవ్ పేరు ఏమైనా ఉంటుందేమో చూడాలి.
Also Read : 8 మంది సిట్టింగ్‌లకు జగన్ షాక్, 11 మంది కొత్తవాళ్లకు, ఐదుగురు వారసులకు అవకాశం.. వైసీసీ సెకండ్ లిస్ట్ విడుదల
గెలుపే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న జగన్.. ఏకంగా సిట్టింగ్ లకే షాక్ ఇస్తున్నారు. అనంతపురం జిల్లాలో హిందూపురం ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ కు ఈసారి టిక్కెట్ లేనట్టేనని వార్తలు జోరుగా వినిపించాయి. చివరికి సెకండ్ లిస్టులో అదే జరిగింది. హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా శాంతను ప్రకటించారు జగన్.
గోరంట్ల మాధవ్ వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆయన వ్యవహారశైలి హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా వీడియో లీక్ వ్యవహారం రచ్చ రచ్చ చేసింది. గోరంట్ల మాధవ్ పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై తీవ్రమైన వ్యతిరేకత రావడానికి ఇదే ప్రధాన కారణం కావొచ్చని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.
కాగా, టికెట్ విషయమై కొన్ని రోజుల క్రితం గోరంట్ల మాధవ్ సీఎం జగన్ ను పలుమార్లు కలిశారు. టికెట్ విషయం గురించి జగన్ తో ఆయన చర్చించారు. జగన్ తో భేటీ తర్వాత.. ఈసారి తనకు టికెట్ ఉందని గానీ, లేదని గానీ స్పష్టమైన సమాచారం ఏమీ లేదని గోరంట్ల మాధవ్ కామెంట్ చేశారు. అయితే, తనకు ఈసారి అవకాశం ఇచ్చినా, ఇవ్వకపోయినా తాను జగనన్న సైనికుడిగానే ఉంటానని, వైసీపీ విజయం కోసం కృషి చేస్తానని చెప్పారు. ప్రతి చిన్న కులానికి కూడా గుర్తింపునివ్వాలని ఆలోచించి సీఎం జగన్ టికెట్లపై నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోందని, దానికి తామంతా కట్టుబడి ఉంటామని గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కురుబ కులానికి ఎక్కడ టికెట్ ఇచ్చినా, కులం అంతా ఒక్కతాటిపై నిలబడి అభ్యర్థి విజయానికి కృషి చేస్తుందన్నారు గోరంట్ల మాధవ్.
Also Read : షర్మిల నిర్ణయంతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో, నియోజకవర్గాల అభ్యర్థుల మార్పులు చేస్తోంది వైసీపీ నాయకత్వం. దాంతో, ఎవరికీ టికెట్ పై గ్యారెంటీ లేకుండా పోయింది. పలు స్థానాల్లో సిట్టింగ్ లను తొలగించేశారు జగన్. కొందరు మంత్రులకు కూడా స్థాన చలనం తప్ప లేదు. మరోవైపు.. ఈ సారి తమకు సీటు రావడం కష్టమని డిసైడ్ అయిపోయిన కొందరు నేతలు.. పక్కపార్టీల వైపు చూస్తున్నారు.