వైసీపీలో జగన్ భారీ మార్పులు.. 27మందితో రెండో జాబితా విడుదల

ఇప్పటికే 11 చోట్ల మార్పులు ప్రకటించిన వైసీపీ మరో జాబితా విడుదల చేసింది.

వైసీపీలో జగన్ భారీ మార్పులు.. 27మందితో రెండో జాబితా విడుదల

YSRCP Second List

Updated On : January 2, 2024 / 11:30 PM IST

YSRCP Changes : వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ పార్టీలో భారీగా మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. పలు స్థానాల్లో ఇప్పటికే మార్పులు చేశారు జగన్. అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లో కొత్త ఇంఛార్జిలను ప్రకటించారు జగన్. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించారు. కొత్త వారికి అవకాశం ఇచ్చారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు స్థానచలనం కల్పించారు. మరికొన్ని చోట్ల ఎంపీలను ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపుతున్నారు.

ఇప్పటికే 11 చోట్ల మార్పులతో వైసీపీ తొలి జాబితా విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీలో మార్పులు చేర్పులకు సంబంధించి రెండో జాబితా వచ్చేసింది. 27 మంది కొత్త ఇంఛార్జ్ లతో సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసింది వైసీపీ అధినాయకత్వం.

Also Read : షర్మిల నిర్ణయంతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

27 మందితో వైసీపీ ఇంఛార్జిల కొత్త లిస్ట్..

అనంతపురం ఎంపీ – శంకరనారాయణ
హిందూపురం ఎంపీ – జోలదరాశి శాంత
అరకు ఎంపీ (ఎస్టీ) – కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి

రాజాం ఎస్సీ – తాలె రాజేశ్
అనకాపల్లి – మలసాల భరత్ కుమార్
పాయకరావు పేట (ఎస్సీ) – కంబాల జోగులు
రామచంద్రపురం – పిల్లి సూర్యప్రకాశ్
పి.గన్నవరం (ఎస్సీ) – విప్పర్తి వేణుగోపాల్
పిఠాపురం – వంగ గీత
జగ్గంపేట – తోట నరసింహం
ప్రత్తిపాడు – వరుపుల సుబ్బారావు
రాజమండ్రి సిటీ – మార్గాని భరత్
రాజమండ్రి రూరల్ – చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
పోలవరం (ఎస్టీ) – తెల్లం రాజ్యలక్ష్మి

Also Read : గోరంట్ల మాధవ్‌కు నిరాశ..! హిందూపురం ఇంఛార్జ్‌గా మహిళకు సీఎం జగన్ అవకాశం

కదిరి – మక్బూల్ అహ్మద్
ఎర్రగొండపాలెం (ఎస్సీ) – తాటిపర్తి చంద్రశేఖర్
ఎమ్మిగనూర్ – మాచాని వెంకటేశ్
తిరుపతి – భూమన అభినయ్ రెడ్డి
గుంటూరు ఈస్ట్ – షేక్ నూరి ఫాతిమా
మచిలీపట్నం – పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)
చంద్రగిరి – చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
పెనుకొండ – ఉషా శ్రీ చరణ్
కల్యాణదుర్గం – తలారి రంగయ్య
అరకు (ఎస్టీ) – గొడ్డేటి మాధవి
పాడేరు (ఎస్టీ) – మత్స్యరాస విశ్వేశ్వర రాజు
విజయవాడ సెంట్రల్ – వెల్లంపల్లి శ్రీనివాస రావు
విజయవాడ వెస్ట్ – షేక్ ఆసిఫ్

Also Read : 8మంది సిట్టింగ్‌లకు జగన్ షాక్, 11మంది కొత్తవాళ్లకు, ఐదుగురు వారసులకు అవకాశం.. వైసీసీ సెకండ్ లిస్ట్ విడుదల