ఇక్కడున్నది అభిమన్యుడు కాదు అర్జునుడు, ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే- సీఎం జగన్

ఇక్కడ పాండవ సైన్యం ఉంటే.. ప్రత్యర్థుల దగ్గర కౌరవ సైన్యం ఉంది. గజదొంగల ముఠా ఉంది.

CM YS Jagan Ranabheri

CM Jagan : ఏపీ సీఎం జగన్ భీమిలిలో ఎన్నికల శంఖారావం పూరించారు. ఎన్నికల సమరానికి సై అన్నారు. ఎన్నికలకు వైసీపీ సిద్ధం అంటూ తొలి బహిరంగ సభలో మాట్లాడారు. ప్రతిపక్షాలపై జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగారు. ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు అని డైలాగ్ చెప్పారు జగన్. ఎన్నికలను యుద్ధంతో పోల్చిన జగన్.. ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే అని వ్యాఖ్యానించారు.

”మనది ప్రజల ప్రభుత్వం. మనది వయసుతో పాటు మనసు, భవిష్యత్తు ఉన్న పార్టీ. భీమిలిలో అటు సముద్రం, ఇటు జన సముద్రం కనిపిస్తోంది. 175 స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా వారికి అభ్యర్థులు లేరు. చేసిన అభివృద్ధిని నమ్ముకుని మళ్లీ ప్రజల దగ్గరికి వెళ్తున్నా. ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే. కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవుల సైన్యం కనిపిస్తోంది.

Also Read : నిన్న పవన్ కల్యాణ్.. నేడు నాగబాబు.. టీడీపీ, జనసేన మధ్య అసలేం జరుగుతోంది?

ఇంతమంది కృష్ణుడి రూపంలో అండగా ఉన్నారు. ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు. ఇక్కడ పాండవ సైన్యం ఉంటే.. ప్రత్యర్థుల దగ్గర కౌరవ సైన్యం ఉంది. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు. అందుకే దత్తపుత్రుడిని వెంటేసుకుని తిరుగుతున్నారు. మన మేనిఫెస్టోలో 99శాతం హామీలను నెరవేర్చాం. అటు వైపు కౌరవ సైన్యం ఉంది. గజదొంగల ముఠా ఉంది. మరో 25ఏళ్ల పాటు మన జైత్రయాత్రకు శ్రీకారం చుడుతున్నాం. నేను మోసాన్ని, అబద్దాన్ని నమ్ముకోలేదు. చేసిన మంచిని, అభివృద్ధిని నమ్ముకునే మీ బిడ్డ.. ఎన్నికలకు వెళ్తున్నాడు. గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా ఈసారి టీడీపీకి రావు” అని సీఎం జగన్ అన్నారు.

Also Read : నెల్లూరులో కాక.. మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌కు షాక్!