Cm Revanth Reddy : వాళ్ళ కుట్రలు తెలపాలనే వర్షంలో కూడా వరంగల్ వచ్చా- సీఎం రేవంత్ రెడ్డి

రేపు జరగబోయేది ఎన్నికలు కాదు యుద్ధం. ఈ యుద్ధంలో కాకతీయుల పౌరుషాన్ని చాటాలి

Cm Revanth Reddy : వాళ్ళ కుట్రలు తెలపాలనే వర్షంలో కూడా వరంగల్ వచ్చా- సీఎం రేవంత్ రెడ్డి

Cm Revanth Reddy : లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్-బీజేపీ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందులో భాగంగానే.. బీఆర్ఎస్ నుండి డమ్మీ అభ్యర్థిని దిష్టిబొమ్మలా పెట్టారని చెప్పారు. రేపు వరంగల్ కు వస్తున్న ప్రధాని మోడీ వరంగల్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు సీఎం రేవంత్.వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని హనుమకొండ చౌరస్తాలో సీఎం రేవంత్ కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు.

”సమ్మక్క సారక్క దేవతలే మనకు ఆదర్శం. అనేక ఉద్యమాలు కాకతీయ యూనివర్సిటీ నుండే పురుడు పోసుకున్నాయి. భూములు కనిపిస్తే మింగే అనకొండలు బీఆర్ఎస్ లో ఉన్నారు. బీఆర్ఎస్-బీజేపీ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయి. బీఆర్ఎస్ నుండి డమ్మీ అభ్యర్థిని దిష్టిబొమ్మలా పెట్టారు. నగదు నారాయణ రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళ కుట్రలు ప్రజలకు తెలపాలనే వర్షంలో కూడా వరంగల్ కు వచ్చాను.

రేపు వరంగల్ కు వస్తున్న ప్రధాని మోడీ వరంగల్ ప్రజలకు సమాధానం చెప్పాలి. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పాలి. బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తరలించుకుపోయారు. రామప్పకు యునెస్కోలో గుర్తింపు సాధిస్తే మీరు ఇచ్చిన నిధులు ఎన్ని..? వరంగల్ కు గాడిద గుడ్డు ఇచ్చారా..? కాకతీయ వారసత్వ నగరాన్ని దిక్కులేని నగరంగా మార్చారు.

కాజీపేట జంక్షన్ ను రద్దు చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఆయన ఇవ్వలేదు.. ఈయన అడగలేదు. తెలంగాణను విధ్వంసం చేసిన కేసీఆర్ కు ప్రజలు బొక్కలు ఇరగ్గొట్టారు. కేటీఆర్ నువ్వు తలకిందులు తపస్సు చేసినా.. మీరు కారును జుమ్మేరాత్ బజార్ లో అమ్ముకోవాల్సిందే. బిడ్డ జైలుకుపోతే పార్టీని తాకట్టు పెట్టినోడు కేసీఆర్. నీతి లేనోడు కేసీఆర్. అసలు కథ ఇప్పుడు మొదలైంది. తెలంగాణ వర్సెస్ గుజరాత్. రేపు జరగబోయేది ఎన్నికలు కాదు యుద్ధం. ఈ యుద్ధంలో కాకతీయుల పౌరుషాన్ని చాటాలి” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : నా బిడ్డను జైల్లో పెట్టినా భయపడను, లొంగిపోయే ప్రసక్తి లేదు- కేసీఆర్