కోటి ఎకరాలకు నీళ్లు.. పచ్చి అబద్దం- కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

కేసీఆర్.. లక్ష కోట్లు ఖర్చు చేస్తే.. లక్ష ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు.

CM Revanth On Medigadda Barrage

CM Revanth Reddy : మేడిగడ్డ బ్యారేజీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ చెప్పిన కోటి ఎకరాల మాగాణికి నీళ్లు ఇచ్చామన్నది పచ్చి అబద్దం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ఆయకట్టు కెపాసిటీ ఇప్పటివరకు 95 వేల ఎకరాలు అని రేవంత్ రెడ్డి తెలిపారు. మొత్తం పూర్తై దశలవారిగా పెంచితే మొత్తం 13 లక్షల ఎకరాలు మాత్రమే నీళ్లు ఇవ్వగలం మన్నారు. ఇప్పటి వరకు 94వేల కోట్లు ఖర్చు అయ్యింది. మొత్తం అంచనా 1 కోటి 27 వేల లక్షల కోట్లు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

”విద్యుత్ బిల్లులు 10వేల 500 కోట్లు.. ప్రతి ఏడాది. ఇప్పటివరకు అయిన ఖర్చుకు ఇక నుండి ప్రతి ఏడాది.. 20వేల కోట్లు మిత్తి, అసలు ఇన్ స్టాల్ మెంట్ కడితే అయ్యే ఖర్చు. ఇప్పటివరకు లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు. కాళేశ్వరం ద్వారా 19,63,000 ఎకరాలు మాత్రమే ఆయకట్టు ప్రతిపాదన. కేసీఆర్.. కోటి ఎకరాలకు నీళ్ళు అనడం పచ్చి అబద్దం. ఇప్పటివరకు 94వేల కోట్లు ఖర్చు చేశారు. కాళేశ్వరంకు ఏడాదికి కరెంట్ బిల్లు 10500 కోట్లు కట్టాలి. అంతా పూర్తైతే.. ప్రతి ఏటా రెండున్నర లక్షలు ఖర్చు చేస్తే.. 19లక్షల ఎకరాలకు నీళ్ళు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కూలింది.

Also Read : కృష్ణా జలాలు మనకు జీవన్మరణ సమస్య, పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నారు- కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

కేసీఆర్.. లక్ష కోట్లు ఖర్చు చేస్తే.. లక్ష ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. మేడిగడ్డలో 85 పిల్లర్స్. 7 బ్లాక్ లో పిల్లర్స్ కుంగాయి. డిజైన్, నిర్వహణ, కాంట్రాక్ట్ పనుల్లో నాణ్యత లోపం ఉందని డ్యాం సేఫ్టీ అథారిటీ చెప్పింది. 2020లోనే నాణ్యతా లోపం ఉందని ఇరిగేషన్ అధికారులు గుర్తించి ఎల్ అండ్ టీ కి లేఖ రాసినా పట్టించుకోలేదు. 2020లోనే మేడిగడ్డ బ్యారేజీలో సమస్య ఉందని అధికారులు ఎల్ అండ్ టీ సంస్థకు లేఖ రాశారు.

2023 అక్టోబర్ లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు వచ్చి పరిశీలించి లోపం ఉన్నట్లు చెప్పారు. 6 రకాల టెస్టులకు సూచించారు. ఇప్పుడు మేడిగడ్డ, సుందిల్లా, అన్నారంలలో ఎక్కడా నీళ్లు లేవు. నీళ్లు స్టోర్ చేస్తే అసలు రంగు బయటపడుతుంది. నీళ్లు స్టోర్ చేస్తే ఇంకా ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో బయటపడతాయి. కాళేశ్వరంలో.. ఐదేళ్లలో 162 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేశారు. గత ఏడాది కేవలం 8 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేశారు. ప్రతి ఏడాది 180 టీఎంసీలు లిఫ్ట్ చేస్తామని కేసీఆర్ చెప్పారు” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : హరీశ్ రావుకి మంత్రి పదవి ఇస్తాం- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

 

ట్రెండింగ్ వార్తలు