కృష్ణా జలాలు మన జీవన్మరణ సమస్య, పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నారు- కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

ఉద్యమం లాగా మనం ఎగిసిపడకపోతే, మనల్ని మనం కాపాడుకోకపోతే ఎవరూ మన రక్షణకు రారు. ఈ మాట రాసి పెట్టుకోండి..

కృష్ణా జలాలు మన జీవన్మరణ సమస్య, పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నారు- కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

KCR Speech

KCR : చలో నల్గొండ సభలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడారు. ‘చలో నల్గొండ కార్యక్రమం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? కొందరికి ఇది రాజకీయం. మనకేమో ఉద్యమ సభ, పోరాట సభ. ఇది రాజకీయ సభ కాదు. కృష్ణా జలాలు, నీళ్ల మీద మన హక్కు అనేది మనందరి బతుకులకు జీవన్మరణ సమస్య. చావో రేవో తేల్చే సమస్య. ఈ మాట తెలంగాణలో పక్షిలాగా తిరుగుతూ చెప్పా’ అని కేసీఆర్ అన్నారు.

”24 ఏళ్ల నుంచి పక్షిలాగా తిరుక్కుంటూ మొత్తం రాష్ట్రానికి నేను చెబుతూనే ఉన్నా. ఇటు కృష్ణా కావొచ్చు అటు గోదావరి కావొచ్చు. నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు. ఆ ఉన్న నీళ్లు కూడా సరిగా లేకపోతే ఇదే నల్గొండబలో బతుకులు వంగిపోయాయి. లక్షా 50వేల మంది మునుగోడు, దేవరకొండ ఇతర ప్రాంతాల బిడ్డల నడుములు ఫ్లోరైడ్ తో ఒంగిపోయాయి. చివరికి ఈ జిల్లాలో ఉద్యమకారులంతా కలిసి ఫ్లోరైడ్ బాధితులను తీసుకెళ్లి ప్రధాని టేబుల్ మీద పడుకోబెట్టి అయ్యా మా బతుకు ఇదీ అని చెప్పినా.. మనల్ని ఎవరూ పట్టించుకోలేదు.

Also Read : హరీశ్ రావుకి మంత్రి పదవి ఇస్తాం- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆ నాడు పార్టీలు, ఎమ్మెల్యేలు అంతా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. నల్గొండను ఫ్లోరైడ్ రహితంగా చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ. ప్రజలను అడిగితే చెబుతున్నారు. ఇంతకుముందు మాకు కాళ్లు, నడుము గుంజుతుండే, భగీరథ నీళ్లు వచ్చాక ఆ బాధలు పోయాయని చెబుతున్నారు. ఎవరిని అడిగినా ఈ మాటే చెబుతారు. ఈ సభ పెట్టింది కొంతమంది సన్నాసులు తెలివిలేక వాళ్లకు వ్యతిరేకం అనుకుంటున్నారు. ఉవ్వెతున ఉద్యమం లాగా మనం ఎగిసిపడకపోతే, మనల్ని మనం కాపాడుకోకపోతే ఎవరూ మన రక్షణకు రారు. ఈ మాట రాసి పెట్టుకోండి” అని కేసీఆర్ అన్నారు.

”నీళ్లను పంచడానికి సిద్ధంగా ఉన్న బ్రిజేశ్ ట్రిబ్యునల్ కు, కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర నీటిపారుదల మంత్రికి, మన నీళ్లు దోచుకుపోవాలనుకునే స్వార్ధ శక్తులకు.. వారందరికీ ఒక హెచ్చరిక ఈ చలో నల్గొండ సభ. ఒక వ్యక్తికో, కొంతమంది గురించో సభ కాదు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్.. ఈ 5 జిల్లాల ప్రజల జీవన్మరణ సమస్య” అని కేసీఆర్ అన్నారు.

Also Read : గులాబీ పార్టీకి ఇప్పుడు పెద్ద సవాల్‌గా ఇదే..

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ నిర్వహించింది. తుంటి ఎముక మార్పిడి తర్వాత మొదటిసారి జనంలోకి వచ్చారు కేసీఆర్. దాదాపు రెండు నెలల తర్వాత కేసీఆర్ ప్రజల మధ్యకు వచ్చారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం చలో నల్గొండ పేరుతో బీఆర్ఎస్ ఈ భారీ బహిరంగ సభ నిర్వహించింది.

చలో నల్గొండ బహిరంగ సభలో కేసీఆర్ కామెంట్స్..
* మిషన్ భగీరథ నీటితో ఫ్లోరోసిస్ ను మాయం చేశాం
* నల్గొండను ఫ్లోరైడ్ ఫ్రీగా చేసిందే బీఆర్ఎస్
* గద్దెనెక్కిన తర్వాత మన బొంద పెడుతున్నారు
* మన నీళ్లు దోచుకోవాలనుకునే వాళ్లకు ఈ సభ ఓ హెచ్చరిక
* పదేళ్ల నా పాలనలో నేను ఎవరికీ తక్కువ చేయలే
* మొగాడైతే ట్రిబ్యునల్ ముందు కొట్లాడాలి
* పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నారు
* నా కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వను
* అసెంబ్లీలో జనరేటర్ పెట్టారు.. ఇదీ కాంగ్రెస్ తెలివి
* కరెంట్‌ ఇవ్వకపోతే బత్కనియ్యం బిడ్డా!