హరీశ్ రావుకి దేవాదాయశాఖ ఇస్తాం- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హరీశ్ రావు, కడియం శ్రీహరి లాగా.. మేము జీ హుజూర్ బ్యాచ్ కాదు. గుంటకాడ నక్కల్లా ఎదురుచూస్తున్నారు. మేము పదవుల కోసం కాదు.. ప్రజల కోసం ఉండేవాళ్ళం.

హరీశ్ రావుకి దేవాదాయశాఖ ఇస్తాం- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Komatireddy Raj Gopal Reddy On Harish Rao

Updated On : February 12, 2024 / 6:18 PM IST

Komatireddy Raj Gopal Reddy : మీడియాతో చిట్ చాట్ లో కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో కీలక నేత, ఎమ్మెల్యే హరీశ్ రావును కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. హరీశ్ రావు కష్టపడతారని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ లో ఆయనకు భవిష్యత్తు లేదన్నారు. హరీశ్.. రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని కామెంట్ చేశారు. 26మందిని తీసుకొస్తే.. హరీశ్ రావుకు దేవాదాయ శాఖ ఇస్తామని, చేసిన పాపాలు కడుక్కోవచ్చని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

”హరీశ్ రావు, కడియం శ్రీహరి లాగా.. మేము జీ హుజూర్ బ్యాచ్ కాదు. కడియం, హరీశ్ లు మమ్మల్ని చీల్చాలని గుంటకాడ నక్కల్లా ఎదురుచూస్తున్నారు. మేము పదవుల కోసం కాదు.. ప్రజల కోసం ఉండేవాళ్ళం. బీఆర్ఎస్ చీప్ పాలిటిక్స్ మానుకోవాలి. కేసీఆర్.. రాష్ట్రాన్ని నాశనం చేశారు.

Also Read : కేసీఆర్ ముక్కు నేలకు రాసి నల్లగొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.. అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి

ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మాపై పడింది. నల్గొండ సభ కోసం.. డబ్బులు పెట్టి జగదీశ్వర్ రెడ్డి కాళ్లు పట్టుకుంటున్నారు. ఆ సభకు ప్రజలు రారు.. కార్యకర్తలు మాత్రమే.. బీఆర్ఎస్ ను ఇంటి బాట పట్టించినందుకా కేసీఆర్ పోరుబాట? కేటీఆర్ కు దమ్ముంటే పార్టీని నడపమను. నల్గొండ సభ.. అట్టర్ ప్లాప్ అవుతుంది. బీఆర్ఎస్ ను ప్రజలు అసహ్యించుకుంటున్నారు” అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

Also Read : గులాబీ పార్టీకి ఇప్పుడు పెద్ద సవాల్‌గా ఇదే..