Mayawati: మదర్సాల్లోని విద్యార్థులను డ్రైవర్లను, మెకానిక్‭లను చేసింది కాంగ్రెసే.. మండిపడ్డ మాయావతి

ప్రజల విరాళాలపై ఆధారపడి నడుస్తున్న మదర్సాలను గుర్తించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. దీని ప్రకారం.. 7,500 కంటే ఎక్కువ గుర్తింపు లేని మదర్సాలు పేద పిల్లలకు విద్య అందించడంలో నిమగ్నమై ఉన్నాయి. ఈ ప్రభుత్వేతర మదర్సాలు ప్రభుత్వానికి భారం కానప్పుడు, వాటిలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏంటి?

Mayawati: నాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. మదర్సాల్లో చదివే విద్యార్థుల్ని డ్రైవర్లను, మెకానిక్‭లను చేసిందని బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి మండిపడ్డారు. ఇప్పుడు వాటి విధ్వంసం దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోందని ఆమె అన్నారు. పేద పిల్లలకు విద్యను అందించడంలో నిమగ్నమై ఉన్న ప్రభుత్వేతర మదర్సాలను ఎందుకు మూసి వేస్తున్నారని, పేద పిల్లలకు పూర్తిగా చదువును నిరాకరించడమే వారి ఎజెండా అని ఆమె అన్నారు.

ఈ విషయమై బుధవారం ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘ప్రజల విరాళాలపై ఆధారపడి నడుస్తున్న మదర్సాలను గుర్తించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. దీని ప్రకారం.. 7,500 కంటే ఎక్కువ గుర్తింపు లేని మదర్సాలు పేద పిల్లలకు విద్య అందించడంలో నిమగ్నమై ఉన్నాయి. ఈ ప్రభుత్వేతర మదర్సాలు ప్రభుత్వానికి భారం కానప్పుడు, వాటిలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వ మదర్సా బోర్డులోని ఉపాధ్యాయులు, సిబ్బంది వేతనాల కోసం ఒక సర్వే నిర్వహించబడింది. అయితే యూపీ ప్రభుత్వం ఈ ప్రైవేట్ మదర్సాలను గ్రాంట్ జాబితాలో చేర్చడం ద్వారా ప్రభుత్వ మదర్సాలుగా మారుస్తుందా? బీఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు 100 మదర్సాలను ప్రభుత్వ బోర్డులో చేర్చింది’’ అని పేర్కొన్నారు.

ఇంకా ఆమె స్పందిస్తూ ‘‘గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మదర్సాల్లోని విద్యార్థుల్ని డ్రైవర్లను, మెకానిక్‭లను చేశారు. మదరసా ఆధునీకరణ పేరుతో వాటిని నిరాదరణకు గురి చేశారు. మదర్సాలను అవమానించారు. ఇప్పుడు బీజేపీ మరింత పెద్ద ఎజెండాతో ముందుకు వచ్చింది. వాస్తవానికి దేశంలో ప్రభుత్వ విద్య అత్యంత అధ్వాన్నంగా తయారవుతోంది. అయినప్పటికీ స్పందించని ప్రభుత్వాలు.. మదర్సాలపై మాత్రం బూటు కాలు వేస్తున్నారు’’ అని అన్నారు.

Ghaziabad: ఢిల్లీలో కిరాతకం.. పార్కింగ్ విషయంలో గొడవ.. బండరాయితో తలపగలకొట్టి, నడి రోడ్డులోనే దారుణ హత్య

ట్రెండింగ్ వార్తలు