Ghaziabad: ఢిల్లీలో కిరాతకం.. పార్కింగ్ విషయంలో గొడవ.. బండరాయితో తలపగలకొట్టి, నడి రోడ్డులోనే దారుణ హత్య

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్యకు గురైన వ్యక్తి పేరు వరుణ్ (35) అని, అతడి తండ్రి డైరీ వ్యాపారం చేస్తాడని పేర్కొన్నాడు. ఇకపోతే.. మంగళవారం రాత్రం ఒక షాప్ వద్ద వరుణ్ తన కారును పార్క్ చేశాడు. అయితే పక్కనే ఉన్న కార్ డోర్లు తెరుచుకోలేనంత దగ్గరగా వరుణ్ తన కారును పార్క్ చేశాడు. దీంతో మరొక వ్యక్తికి వరుణ్‭కి మధ్య వివాదం తలెత్తింది.

Ghaziabad: ఢిల్లీలో కిరాతకం.. పార్కింగ్ విషయంలో గొడవ.. బండరాయితో తలపగలకొట్టి, నడి రోడ్డులోనే దారుణ హత్య

Video Of Fight Over Parking Near Delhi Shows A Head Smashed With A Brick

Ghaziabad: పార్కింగ్ విషయంలో తలెత్తిన తగాదా.. చిలికి చిలికి గాలి వానలా మారింది. ఇద్దరు వ్యక్తుల మధ్య మాటా మాటా పెరిగి చివరికి హత్య వరకు వెళ్లింది. తీవ్ర కోపోద్రిక్తుడైన ఒక వ్యక్తి బండరాయితో మరొక వ్యక్తి తల పగలగొట్టాడు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్‭లో జరిగిందీ దారుణం. దీనికి సంబంధించిన వీడియో సహా ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్యకు గురైన వ్యక్తి పేరు వరుణ్ (35) అని, అతడి తండ్రి డైరీ వ్యాపారం చేస్తాడని పేర్కొన్నాడు. ఇకపోతే.. మంగళవారం రాత్రం ఒక షాప్ వద్ద వరుణ్ తన కారును పార్క్ చేశాడు. అయితే పక్కనే ఉన్న కార్ డోర్లు తెరుచుకోలేనంత దగ్గరగా వరుణ్ తన కారును పార్క్ చేశాడు. దీంతో మరొక వ్యక్తికి వరుణ్‭కి మధ్య వివాదం తలెత్తింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే వరుణ్ దారుణ దాడికి గురయ్యాడు. రక్తపు మడుగులో అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడని పోలీసులు తెలిపారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వరుణ్‭ను మరొక వ్యక్తి పెద్ద బండరాయితో కొడుతున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. కింద పడి ఉన్న వరుణ్ తలపై పెద్ద బండరాయిని పడేశారు. ఆ సమయంలో వరుణ్ స్నేహితుడు దీపక్ అక్కడే ఉన్నప్పటికీ.. క్షణ కాలంలో ఈ దారుణం జరిగిపోయిందని వాపోయాడు. శత్రువులు సైతం ఆ స్థాయిలో దాడి చేయరని పేర్కొన్నాడు. ఈ ఘటన ఘజియాబాద్‭లోని శాంతిభద్రతలపై అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతోందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

PM Modi Visakha Tour : ఏపీకి ప్రధాని మోదీ.. నవంబర్ 11న విశాఖలో పర్యటన, అభివృద్ధి పనులకు శంకుస్థాపన