కరోనా ఎఫెక్ట్ : GHMC అలర్ట్..రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు

  • Publish Date - March 18, 2020 / 01:06 AM IST

కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతుంటే కొన్ని సంస్థలు మాత్రం డోంట్‌ కేర్‌ అంటున్నాయి. గుట్టుచప్పుడుగా తమ కార్యకలాపాలను సాగిస్తుండటంతో జీహెచ్‌ఎంసీ మెరుపుదాడులు చేసింది. నిబంధనలను అతిక్రమించిన పలు పలు విద్యాసంస్థలు.. పబ్బులు, ఇతర సంస్థలపై జీహెచ్‌ఎంసీ ఎన్ఫోర్స్‌మెంట్ విభాగం మెరుపు దాడులు చేసింది.

కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే.. హైదరాబాద్‌లో రూల్స్‌కు వ్యతిరేకంగా దర్జాగా ఓపెన్‌ చేశాయి 66 సంస్థలు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు తనిఖీలు నిర్వహించి పలు సంస్థలను సీజ్‌ చేశారు. ఎవరైనా రూల్స్‌ అతి క్రమిస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు నగరంలో 18 బృందాలను ఏర్పాటు చేశామని..ఎప్పటికప్పుడు వారు తనిఖీలు  నిర్వహిస్తారని తెలిపారు. 

కరోనా నివారణ పై ప్రభుత్వం ఆదేశాలతో బల్దియా యంత్రాంగం కదిలింది. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ప్రత్యేక చర్యలు చెపట్టింది. సిటిలో వైరస్ వ్యాప్తి కాకుండా ఉండేలా తమకు కేటాయించిన విధులను పూర్తిగా నిర్వహిస్తున్నామంటున్నారు అధికారులు. ప్రధానంగా శానిటేషన్ నిర్వహణలో ప్రత్యేక శ్రద్ద పెట్టారు. బల్దియాలోని  శానిటేషన్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసకుంటున్నారు.

Also Read | ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత…నేడే నామినేషన్‌!

ఇక నగరంలోని పౌరులకు వ్యాధి లక్షణాలు… వైరస్‌వ్యాప్తి చెందకుండా ఉండేలా తీసుకోవాల్సిన చర్యలు… మహమ్మారి నివారణకు తీసుకోవాల్సిన అంశాలపై ప్రత్యేక అవగాహన కల్పించేలా కరపత్రాలు పంపిణి చేస్తున్నారు. పోస్టర్లు ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇక బల్దియా కార్యాలయాలకు పెద్ద సంఖ్యలో విజిటర్స్ వస్తున్న నేపథ్యంలో ఇబ్బందులు రాకుండా ఉండేలా కార్యాలయానికి వచ్చే వారికి శానిటైజర్ ద్వారా చేతులు శుభ్రం చేసుకోనే ఏర్పాట్లు చేశారు. 

వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరిస్తుందని ప్రజలు భయపడాల్సిన అవసర లేదంటున్నారు మేయర్ బొంతు రామ్మోహన్. కరోనాను కట్టడి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనికి అందరూ సహకరించాలని.. ప్రజలు అప్రమత్తంగా ఉంటే వైరస్‌ను అరికట్టవచ్చంటున్నారు. 

Read More : ఏపీలో కరోనా కట్టడికి కమిటీ..12 రైళ్లు రద్దు