తెలంగాణ రాష్ట్రంలో కరోనా మెల్లిమెల్లిగా విజృంభిస్తోంది. ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. లెటెస్ట్‌గా ఈ సంఖ్య 16కు చేరుకుంది. వైరస్ లక్షణాలు ఉన్న వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ సర్కార్ అలర్ట్ అయ్యింది. 2020, మార్చి 19వ తేదీ గురువారం సీఎం కేసీఆర్ అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించారు.(పబ్లిక్‌లో తుమ్మాడని చితకబాదారు: కరోనా కష్టాలు)
వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక్కడ ప్రయాణీకులను క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరుగుతోందన్ానరు. విదేశీ ప్రయాణం చేసి తెలంగాణకు వచ్చే వారు స్వచ్చందంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. వీరందరూ తమంతట తాము గృహ నిర్భందం చేసుకోవాలని సూచించారు. లేనిపక్షంలో అధికారులు వారిని ఇంటి వద్దే ఉండే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు రైళ్లలో ఇక్కడకు వస్తున్నారని, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా దక్షిణ మధ్య రైల్వే అధికారులను కూడా కోరడం జరిగిందన్నారు.
Read More : పాపం పండింది : నిర్భయ దోషుల ఎత్తులు..2013 – 2020 కొనసాగిన డ్రామాలు
చెక్ పోస్టుల జాబితా
చెక్ పోస్టు పేరు | జిల్లా పేరు |
ఆదిలాబాద్ | ఆదిలాబాద్ |
వాంకిడి | కొమరం భీమ్ |
భైంసా | నిర్మల్ |
కల్లూరు | ఖమ్మం |
పాల్వంచ | భద్రాద్రి |
అశ్వారావు పేట | భద్రాద్రి |
నాగార్జున సాగర్ | నల్గొండ |
విష్ణుపురం | నల్గొండ |
కోదాడ | సూర్యాపేట |
కృష్ణా | మహబూబ్ నగర్ |
అలంపూర్ | జోగులాంబ గద్వాల్ |
జహీరాబాద్ | సంగారెడ్డి |
సలూర | నిజామాబాద్ |
మద్నూర్ | కామారెడ్డి |
హైదరాబాద్ – శ్రీశైలం రోడ్ | ఈగలపెంట, నాగర్ కర్నూలు |
హైదరాబాద్ – భూపాలపట్నం | కొత్తూరు, భద్రాద్రి జిల్లా |
హైదరాబాద్ – బీజాపూర్ | రావులపల్లి, వికారాబాద్ జిల్లా |
సిరోంచ – ఆత్మకూరు | కాళేశ్వరం, భూపాలపల్లి |
రాష్ట్ర సరిహద్దుల వద్ద 18 చెక్ పోస్టులు ఏర్పాటుచేసి ప్రయాణికులకు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తాం. విదేశీ ప్రయాణం చేసినవారిని గృహ నిర్బంధంలో ఉంచుతాము. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా దక్షిణమధ్య రైల్వే అధికారులను కూడా కోరడం జరిగింది: సీఎం #CoronaVirusUpdates pic.twitter.com/0Dp5F4v19y
— Telangana CMO (@TelanganaCMO) March 19, 2020