రైతులను కాదంటే.. వారి శవాల మీద నుంచి రాజధానిని తీసుకువెళ్ళాలి

  • Publish Date - December 27, 2019 / 01:52 PM IST

ఏపీ రాజధాని  తరలింపు అంశంలో రైతులను కాదని అక్కడి నుంచి ముందుకు వెళితే …రైతుల శవాలపై నుంచి తీసుకువెళ్లాలని సీపీఐ  జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాజధాని తరవలింపుపై అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న దీక్షకు మద్దుతుగా ఆయన శుక్రవారం సంఘీభావం ప్రకటించారు. 

నారాయణ దీక్షా శిబిరం వద్దకు వచ్చే సరికి పోలీసులు రోప్ పార్టీతో అడ్డం పెట్టేసరికి ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. మేమేమైనా రౌడీలమా టెర్రరిస్టులమా అని ఆయన పోలీసులపై మండిపడ్డారు. జగన్ కు చంద్రబాబు తో వైరం  ఉంటే  అక్కడ తేల్చుకోవాలి కానీ రైతులు, కూలీలను మోసం చేయవద్దని అన్నారు. రైతులకు మద్దతుగా సీపీఐ పార్టీ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. 

గత ప్రభుత్వనిర్ణయాలు లోపభూయిష్టంగా ఉన్నాయని రాజధానిని మార్చటం సరికాదన్నారు.  ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజధాని మార్చటం సరికాదని..ప్రజస సౌకర్యం రాజధాని ఉండాలే కానీ  కక్ష సాధించుకోటానికి మార్చటం సరికాదని హితవు పలికారు.
చిన్నవయస్సులోనే జగన్ సీఎం అయ్యారని…. మరో 30 ఏళ్లు సీఎం గా ఉండేట్టు నిర్ణయాలు ఉండాలే కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని  నారాయణ అన్నారు.