ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ పై పురువు నష్టం దావా వేయనున్నట్లు మాజీ మంత్రి బీజేపీ నాయకుడు రావెల కిషోర్ బాబు చెప్పారు. తనపై బుగ్గన అసెంబ్లీలో నిరాధారమైన ఆరోపణలు చేసారని అందుకే ఆయనపై రూ.10 కోట్ల రూపాయలకు పరువునష్టం దావావేయనున్నట్లు రావెల తెలిపారు.
విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ, మనోభావాలు దెబ్బతినేలా బుగ్గన వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. నా నోటీస్ అందిన తర్వాత బుగ్గన రాజేంద్ర బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బుగ్గనపై పరువు నష్టం దావా వేయటంతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని ఆయన చెప్పారు.
నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను కుటుంబ పోషణే నాకు భారంగా ఉంది. నాపై ఇలాంటి ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నానని ఆయన చెప్పారు. ఒక దళిత నాయకుడిగా ఎదిగిన తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించిద్ీీీీీీీీీీీీీీీీీీీీీీీీీీీీీీీీీ న్నారు. నాకు రాజధాని ప్రాంతంలో భూములు ఉన్నాయని అసత్య ప్రచారం చేస్తున్నారని… రాజధాని అమరావతిని తరలిచేందుకు వైసీపీ పెద్ద కుట్ర పన్నుతోందని రావెల అన్నారు.
రాజధాని ప్రాంతంలో భూములు కొన్న టీడీుపీ నవారక
2019, డిసెంబర్ 17న శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో …..తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంద్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు వారి బంధువులు 4,070 ఎకరాలు కొన్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సభలో ప్రకటించారు. టీడీపీ నాయకులు ఎవరెవరు ఎంత భూములు కొనుగోలు చేశారో చూడండంటూ ఒక జాబితాను మంత్రి బుగ్గన శాసనసభలో చదివి వినిపించారు.
కంతేరులో హెరిటేజ్ ఫుడ్స్ 14.22 ఎకరాలు
బంధువుల పేరుతో నారాయణ 55.27 ఎకరాలు
ప్రత్తిపాటి పుల్లారావు తన బంధువుల పేరుతో 38 ఎకరాలు
బంధువుల పేరుతో రావెల 40.85 ఎకరాలు
పయ్యావుల కేశవ్ తన బంధువుల పేరుతో 15.30 ఎకరాలు
రాయపాటి సాంబశివరావు 55.27 ఎకరాలు
బంధువుల పేరుతో కోడెల 17.13 ఎకరాలు
బాలకృష్ణ వియ్యంకుడికి జగ్గయ్యపేటలో 499 ఎకరాలు
ధూళిపాళ్ల నరేంద్ర బంధువుల పేరుతో 13.50 ఎకరాలు
లింగమనేని రమేష్ బంధువుల పేరుతో 351 ఎకరాలు
ఇంకా పరిటాల సునీత, కొమ్మలపాటి శ్రీధర్, జీవీఎస్ ఆంజనేయులు, పల్లె రఘునాథరెడ్డి, పుట్టా మహేష్‌కు కూడా భూములు ఉన్నాయని ఆర్ధిక మంత్రి బుగ్గన చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన మాజీ మంత్రి రావెల పరువునష్టం దావా వేసే ఆలోచనలో ఉన్నారు.