వైసీపీలో చేరిన మాజీమంత్రి రావెల కిశోర్ బాబు..

దీంతో అక్కడ బాలసాని కిరణ్ ను తప్పించి ఆయన స్థానంలో రావెల్ కిశోర్ బాబును ప్రత్తిపాడు ఇంఛార్జ్ గా నియమించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Ravela Kishore Likely To Be Prathipadu YCP Incharge

Ravela Kishore Babu : మాజీమంత్రి రావెల కిశోర్ బాబు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయనకు కండువా కప్పిన సీఎం జగన్.. పార్టీలోకి ఆహ్వానించారు. రావెల కిశోర్ బాబు.. ఏపీ సీఎం క్యాంప్ ఆఫీసుకి వెళ్లారు. సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. అనంతరం వైసీపీ కండువా కప్పుకున్నారు. కాగా, రావెల కిశోర్ బాబును ప్రత్తిపాడు వైసీపీ ఇంఛార్జ్ గా నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రత్తిపాడు వైసీపీ ఇంఛార్జ్ గా బాలసాని కిరణ్ కుమార్ ఉన్నారు. అయితే, బాలసాని కిరణ్ కుమార్ పట్ల వైసీపీ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. దీంతో అక్కడ బాలసాని కిరణ్ ను తప్పించి ఆయన స్థానంలో రావెల్ కిశోర్ బాబును ప్రత్తిపాడు ఇంఛార్జ్ గా నియమించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

మాజీమంత్రి రావెల కిశోర్ బాబు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్లి సీఎం జగన్ ను కలిశారు. రావెల కిశోర్ బాబు వైసీపీలో చేరతారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆయన తాడేపల్లి వెళ్లి సీఎం జగన్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రత్తిపాడు నుంచి ఆయన బరిలోకి దిగనున్నారని సమాచారం. ప్రత్తిపాడు వైసీపీ ఇంఛార్జ్ గా రావెల కిశోర్ బాబును నియమిస్తారని వార్తలు వస్తున్నాయి.

Also Read : పరువు తీసుకున్నారు.. షర్మిలపై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు

టీడీపీ హయాంలోనూ ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచే రావెల కిశోర్ బాబు ప్రాతినిధ్యం వహించారు. మంత్రిగా కూడా పని చేశారు. ఆ తర్వాత ఆయన జనసేనలో చేరారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం వైసీపీలో జాయిన్ అయ్యారు. ప్రత్తిపాడు ఇంఛార్జిగా రావెలను నియమించే ఆలోచన వైసీపీ అధినాయకత్వం చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మేకతోటి సుచరితను తాటికొండను మార్చారు.

ప్రత్తిపాడుకు సంబంధించి వైసీపీ ఇంఛార్జిగా కిరణ్ కుమార్ ను ప్రకటించారు జగన్. అయితే, బాలసాని కిరణ్ కుమార్ కు సర్వేలు వ్యతిరేకంగా ఉన్నాయి. స్థానిక క్యాడర్ ఆయనకు వ్యతిరేకంగా ఉన్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో కొత్త వ్యక్తికి వైసీపీ ఇంఛార్జి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే రావెల కిశోర్ బాబుతో సంప్రదింపులు జరిపారు. రావెల కూడా దీనికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

Also Read : ఫిబ్రవరి మొదటి వారంలో టీడీపీ-జనసేన మొదటి జాబితా!