కుట్రలపై అప్రమత్తంగా ఉండండి : చంద్రబాబు జాగ్రత్తలు

ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు సూచనలు, సలహాలు ఇచ్చారు. జాగ్రత్తలు చెబుతున్నారు. ఎన్నికల సమయం.. పోలింగ్ కు వెళ్తున్నాం.. కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా నేతలకు సూచించారు. మార్చి 12వ తేదీ ఉదయం టెలీకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా నేతలతో చర్చించారు. ప్రత్యర్థి పార్టీలు కుట్రలు చేస్తున్నారని.. నిత్యం వాటిని గమనిస్తూ ఉండాలని కోరారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని.. ప్రతిపక్షాల కుట్రలను సమర్ధవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ప్రజల అభిప్రాయం తెలుసుకుని.. కార్యకర్తల ఇష్టాఅయిష్టాల మేరకే ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు వివరించారు. కుటుంబ పెద్దగా అందరికీ న్యాయం చేసే బాధ్యతగా నాపై ఉందన్నారు. టీడీపీ నాయకులంతా ఎన్నికలకు సిద్ధం అయి ప్రజల దగ్గరకు వెళ్లాలని నేతలకు సూచించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. టికెట్లను అమ్ముకుంటుందని.. వేలంపాట వేస్తుందని విమర్శలు చేశారు. చింతలపూడిలో రూ.3 కోట్లు ఇస్తానంటే ఒకరికి.. అంతకంటే ఎక్కువ ఇస్తానంటే మరొకరికి అంటూ అభ్యర్థులను మార్చుకుంటూ డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. టీడీపీ సంస్కృతి అది కాదనీ.. ప్రజలు ఇష్టపడిన నాయకులనే ఎన్నికల అభ్యర్ధులను నిలబెడతామని చంద్రబాబు స్పష్టం చేశారు.