Ysrcp Defeat: జగన్ అడ్డాలో ఏమైంది.. వైసీపీకి ఎందుకీ పరాభవం? నాటి ఆ నిర్లక్ష్యమే నేటి ఈ ఓటమికి కారణమా?

గత 30ఏళ్లలో అక్కడ వైఎస్ ఫ్యామిలీ బలపరిచిన నేత తప్ప మరొకరు గెలవలేదు. అసలు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన దాఖలాలు తక్కువ. (Ysrcp Defeat)

YS Jagan

Ysrcp Defeat: పులివెందుల ఈ పేరు చెప్తే చాలు. అందరికీ వైఎస్ ఫ్యామిలీ గుర్తుకు వస్తుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా..ఎన్నిక ఏదైనా వైఎస్‌ ఫ్యామిలీది..వాళ్లున్న పార్టీదే గెలుపు అని పబ్లిక్ డిసైడ్ అయిపోతుండే వారు. పైగా పులివెందులలో జగన్‌ ఎంత మెజార్టీతో గెలిచిన ఎంతో హైప్‌ వచ్చేది. సేమ్‌ టైమ్‌ ఆ నియోజకవర్గంలో ఆయనకున్న పట్టు అలాంటిదన్న చర్చ జరిగేది. కానీ ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ బైఎలక్షన్‌లో..జగన్‌ కంచుకోటలతో వైసీపీ ఓటమి..కొత్త రకం చర్చకు దారి తీస్తోంది.

టీడీపీ రిగ్గింగ్ చేసిందని..దొంగ ఓట్లతో..అరాచకాలు చేసి గెలిచిందని వైసీపీ అంటున్నా..విజయం ఎపుడూ విజయమే. ఓటమి ఓటమే. రిగ్గింగ్ లు అని అధికార బలం అని దౌర్జన్యాలు అని ఎన్ని చెప్పినా అవన్నీ పొలిటికల్ వార్‌గానే ఉంటాయి. దీంతో టీడీపీ గెలుపు ఎలా సాధ్యమైంది..? జగన్‌కు, వైసీపీకి ఉన్న కంచుకోట ఆ ట్యాగ్ చెడిపోయిందా.? అన్న టాక్ మొదలైంది.

ఏకంగా ఎన్నికలు జరిగాయి, వైసీపీకి డిపాజిట్లు పోయాయి..

వైసీపీకి, జగన్‌కు ఏడాదిగా బ్యాడ్ టైమ్ నడుస్తుందనే చెప్పాలి. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని మరచిపోక ముందే ఏకంగా జగన్ సొంత ఇలాకాలో ఒక చిన్న ఎన్నికల్లో క్లైమోర్‌ మైన్‌ పేలినట్లుగా ఫలితం వచ్చింది. గత 30ఏళ్లలో అక్కడ వైఎస్ ఫ్యామిలీ బలపరిచిన నేత తప్ప మరొకరు గెలవలేదు. అసలు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన దాఖలాలు తక్కువ. ఏకగ్రీవంతోనే లోకల్ బాడీ పోల్స్ అన్నీ తమ ఖాతాలో వేసుకునే వారు. కానీ ఈసారి అలా జరగలేదు. ఎన్నికలు జరిగాయి. ఏకంగా వైసీపీకే డిపాజిట్లు పోయాయి.

ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు కొంప ముంచింది..!
సొంత అడ్డాలో ఎందుకీ ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చిందన్నదే హాట్ టాపిక్‌ అవుతోంది. వైసీపీ అగ్ర నాయకత్వం నిర్లక్ష్యం వల్లే సిటింగ్‌ సీటును పోగొట్టుకోవాల్సి వచ్చిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పులివెందుల జడ్పీటీసీ మహేశ్వరరెడ్డి మరణంతో బైఎలక్షన్‌ వచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే 2022లోనే జడ్పీటీసీ మహేశ్వరరెడ్డి చనిపోయారు. అప్పుడే ఉప ఎన్నిక జరిగేలా చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఈ ఎన్నిక జరిగేది. ఇప్పుడీ పరాభవాన్ని భరించాల్సిన పరిస్థితి వచ్చేది కాదని వైసీపీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారట.

కానీ 2022లో సిట్టింగ్ జడ్పీటీసీ చనిపోతే..2024 జూన్ వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ..ఏ కారణం వల్లో కానీ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక నిర్వహణకు ఆసక్తి చూపలేదు. ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు కొంప ముంచిందన్నది ఫ్యాన్ పార్టీ నేతల బాధ అంటున్నారు.

ఈ పరిణామాలన్నీ టీడీపీ విజయానికి ఎల్లో కార్పెట్ వేశాయన్న టాక్ నడుస్తోంది. నాలుగైదు ఎన్నికల్లో గెలిచిన వారి కంటే ఎక్కువ గుర్తింపు, అంతకు మించి ఒక్క రోజులోనే స్టేట్‌ లీడర్‌ అన్నంత హైప్‌ ఒక్క విజయంతో సొంతం చేసుకున్నారు పులివెందుల జడ్పీటీసీ మారెడ్డి లతారెడ్డి. ఆమె భర్త బీటెక్ రవి పలుసార్లు పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచారాయన. అది కూడా వైఎస్ ఫ్యామిలీ మెంబర్ వైఎస్ వివేకానంద మీదే.

అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు సతీమణి, హెరిటేజ్ సంస్థల డైరెక్టర్ నారా భువనేశ్వరి పులివెందుల ఫలితంపై హర్షం వ్యక్తం చేస్తూ జడ్పీటీసీ లతారెడ్డికి ఫోన్ చేసి మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. పులివెందులతో పాటు ఒంటిమిట్టలోనూ ఎన్నిక జరిగినా, అక్కడ గెలిచిన జడ్పీటీసీ ముద్దు కృష్ణారెడ్డి కోసం పెద్దగా చర్చ జరగడం లేదంటున్నారు.

కానీ ఎవరి నోట విన్నా లతారెడ్డి విజయంపైనే చర్చించుకోవడం..పులివెందులకు ఉన్న బ్రాండే కారణం. పైగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల టీడీపీ అభ్యర్థి లతారెడ్డేనని ఇప్పటి నుంచే ప్రచారం ఊపందుకుంది. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల మధ్య జరిగిన పులివెందుల జడ్పీటీసీ బైపోల్‌..ఏపీ పాలిటిక్స్‌లో పెద్ద సంచలనాన్ని నమోదు చేసింది.

Also Read: ఓడిపోతే “ఓట్ల చోరీ” అంటున్నారు.. గెలిచినప్పుడు ఓ న్యాయం.. ఓడినప్పుడు మరో న్యాయమా?: పవన్ కల్యాణ్