gujarat autowala who invited kejriwal to his home for dinner is bjp worker
AAP: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి ఉత్సహంతో గుజరాత్ ఎన్నికల బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఏమాత్రం తీసిపోకుండా రోజువారి ప్రచారాలతో దూసుకుపోతోంది. కొద్ది రోజుల క్రితం హైడ్రామా నడుమ గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో ఒక ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్లి కేజ్రీవాల్ భోజనం చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వాస్తవానికి ఆప్‌కు అత్యంత ప్రచారాన్ని ఇచ్చిన ఈ ఘటన.. తాజాగా ఆప్‌ను చిక్కుల్లో పడేసేట్టుగా కనిపిస్తోంది. కారణం.. ఆ ఆటో ట్రైవర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కావడం.
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వీరాభిమాని అయిన సదరు ఆటోవాలాకు డబ్బు ఆశ చూపించి కేజ్రీవాల్ ఈ స్టంట్ చేశారట. బీజేపీ గుజరాత్ మీడియా అధినేత జుబిన్ ఆష్రాతో కలిసి సదరు ఆటోవాలా ఓ వీడియోలో మాట్లాడారు. ఆప్ నేతలు తనకు డబ్బు ఇచ్చారని, ఆ డబ్బు ఆశతోనే అందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందని ఆ వీడియాలో చెప్పుకొచ్చాడు. తాను చిన్నప్పటి నుంచి నరేంద్రమోదీకి అభిమానినని, కేవలం డబ్బు కోసమే ఆప్ నేతలు చెప్పమన్నట్లు చెప్పానని చెప్పాడు విక్రమ్ దంతాని అనే ఆటోవాలా.
దీనిని అదునుగా చూసి ఆప్‌పై బీజేపీ నేతలు ఒంటి కాలిపై లేస్తున్నారు. తమ పార్టీ సానుభూతి పరులను డబ్బులతో లొంగదీసుకోవాలని చూస్తున్నారని, కానీ అది సాధ్యం కాదంటూ కేజ్రీవాల్‌పై మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వివాదం మొదటి దశలోనే ఉంది. బీజేపీ ఎంత మేరకు దీన్ని వివాదంగా మారుస్తుంది? దానికి ఆప్ ఎలా బదులిస్తుందనేది చూడాలి.
ये वही ऑटोवाला विक्रम दंतानी है जिसके घर केजरीवाल जी मीडिया को लेकर खाना खाने गए थे।
विक्रम भाई का कहना है की केजरीवाल के लोग उन्हे पैसे की बात कहकर मनाए थे पर ये बचपन से ही मोदी जी के फैन हैं। ? pic.twitter.com/iWNBj4GqwK
— Zubin Ashara (@zubinashara) September 30, 2022
Congress President Poll: నామినేషన్ వేసిన అనంతరం గాంధీ కుటుంబంపై శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు