Congress President Poll: నామినేషన్ వేసిన అనంతరం గాంధీ కుటుంబంపై శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

వాస్తవానికి థరూర్ ఇలా చెబుతున్నప్పటికీ ఈ బరిలోకి దిగుతున్న మల్లికార్జున ఖర్గేకు గాంధీ కుటుంబం మద్దతు ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే గాంధీ కుటుంబ సూచనలతోనే చివరి నిమిషంలో ఆయన పోటీకి దిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ పోటీ కేవలం సహచరుల మధ్య పోటీగానే జరుగుతుందని, ఏం జరిగినా అది కాంగ్రెస్ ఎదుగుదల కోసమేనని, ఎవరు గెలిచినా కాంగ్రెస్ గెలుపేనని థరూర్ వ్యాఖ్యానించారు

Congress President Poll: నామినేషన్ వేసిన అనంతరం గాంధీ కుటుంబంపై శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

Congress President Poll: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతోన్న శశి థరూర్.. తాజాగా గాంధీ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ డీఎన్ఏలో గాంధీలు ఒక భాగం మాత్రమేనని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అంతే కాకుండా సోనియాను కలవడంపై కూడా ఆయన స్పందిస్తూ వారి ఆమోదం కోసం కాకుండా వైఖరి తెలుసుకోవడానికే కలిశానని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో హై కమాండ్ కల్చర్ మారాలని, అది తాను చేసి చూపిస్తానని అన్నారు. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం నామినేషన్ వేసిన అనంతరం ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘నేను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడాన్ని సోనియా గాంధీ స్వాగతించారు. ఈ ఎన్నికల్లో తమ కుటుంబం తటస్థంగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. అయితే సోనియా ఆమోదం కోసం నేను కలవలేదు. ఈ ఎన్నికపై వారి వైఖరి ఏంటనేది తెలుసుకోవడానికి మాత్రమే కలిశాను’’ అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘మీరు ఎందుకు పోటీ చేస్తున్నారని సోనియ అడగలేదు. సరైన అభ్యర్థిని మేమే ప్రకటిస్తాం, ఎన్నుకుంటామని చెప్పలేదు. ఎన్నికలు పార్టీకి మంచిదని తాను నమ్ముతున్నట్లు సోనియా చెప్పారు. అలాగే అధికారిక అభ్యర్థి అంటూ ఎవరూ ఉండరని అన్నారు’’ అని అన్నారు.

వాస్తవానికి థరూర్ ఇలా చెబుతున్నప్పటికీ ఈ బరిలోకి దిగుతున్న మల్లికార్జున ఖర్గేకు గాంధీ కుటుంబం మద్దతు ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే గాంధీ కుటుంబ సూచనలతోనే చివరి నిమిషంలో ఆయన పోటీకి దిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ పోటీ కేవలం సహచరుల మధ్య పోటీగానే జరుగుతుందని, ఏం జరిగినా అది కాంగ్రెస్ ఎదుగుదల కోసమేనని, ఎవరు గెలిచినా కాంగ్రెస్ గెలుపేనని థరూర్ వ్యాఖ్యానించారు. అలాగే తాను జీ-23 తరపున కాకుండా వేల మంది మద్దతు కోసం పోటీకి దిగినట్లు థరూర్ స్పష్టం చేశారు.

BSP Supremo: ఆర్ఎస్ఎస్‭ను సాంత్వన పరిచేందుకే పీఎఫ్ఐపై నిషేధం.. బీజేపీపై మండిపడ్డ మాయావతి