సైకో శ్రీనివాస్ రెడ్డికి ఉరి : హాజీపూర్ గ్రామస్తుల హర్షం

  • Publish Date - February 6, 2020 / 01:24 PM IST

హాజీపూర్ గ్రామం సంతోషంలో మునిగితేలుతోంది. పది నెలలుగా అనంతరం వెలువడిన తీర్పుపై ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. వరుస హత్య కేసుల నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి ఉరి శిక్ష విధిస్తున్నట్లు నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు విధించింది. దీనిపై హాజీపూర్ గ్రామస్తుల నుంచే కాకుండా..ఇతర వర్గాల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. తమకు న్యాయం జరిగిందని కుటుంబసభ్యులు వెల్లడిస్తున్నారు.

త్వరగా శిక్ష విధించాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా సీపీ మహేశ్ భగవత్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి, హత్య చేసినట్లు కోర్టు నిర్ధారించింది. ఇద్దరు బాలికల కేసులో ఉరి శిక్ష, మరో బాలిక కేసులో యావజ్జీవ శిక్ష విధిస్తున్నట్లు తీర్పును వెలువరించింది. 

* 2019 అక్టోబర్ 14 నుంచి 2020 జనవరి 17 వరకు విచారణ.
* విచారణ అధికారిగా భువనగిరి ఏసీపీ భుజంగరావు నియామకం.
* నల్గొండలో ప్రత్యేకంగా పోక్సో కోర్టు ఏర్పాటు. 
* జులై 31న ఛార్జీషీట్ దాఖలు. 

* 2019 అక్టోబర్ 14 నుంచి విచారణ ప్రారంభం. 
* ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా చంద్రశేఖర్ నియామకం. 
* 50 పనిదినాల్లో దశలవారీగా కోర్టు విచారణ.

* 101 సాక్షుల వాంగ్మూలాను నమోదు చేసిన కోర్టు. 
* సెక్షన్ 113 కింద నిందితుని అభిప్రాయాన్ని కూడా తీసుకున్న కోర్టు. 
* 44 మంది సాక్షుల వాంగ్మూలాన్ని చదివి వినిపించారు న్యాయమూర్తి.