Kamal Haasan: డీఎంకేతో పొత్తుపై ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి కుమారుడు అనే సంతోషం ఎంతో ఉన్నప్పటికీ.. అంతకు మించిన కష్టాలు, సవాళ్ళు ఆయనకు ఉన్నాయి. ఒకవైపు సంతోషాన్ని అనుభవిస్తూనే మరొకవైపు కష్టాలను ఎదురీదుతూ అంచెలంచెలుగా ఒక కార్యకర్తగా, యువజన విభాగం అధ్యక్షుడిగా, శాసనసభ సభ్యుడిగా, మేయర్‌గా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, ఇపుడు ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు

Kamal Haasan: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీతో పొత్తు విషయమై మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ స్పందించారు. పొత్తు విషయమై ఇప్పుడప్పుడే చెప్పలేమన్న ఆయన, కథను సీన్‌ బై సీన్‌గా ముందుకు తీసుకెళ్ళాలని తనదైన సినిమాటిక్‌ శైలిలో వ్యాఖ్యానించారు. బుధవారం (మార్చి1)న తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ 70వ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం చెన్నైలోని స్థానిక ప్యారీస్‏లోని రాజా అన్నామలై మండ్రంలో స్టాలిన్‌ 70 పేరుతో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కమల్‌హాసన్‌ ప్రారంభించారు.

Satvik Death Case: శ్రీచైతన్య కాలేజీ‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య .. ప్రభుత్వం సీరియస్.. ముగ్గురి సిబ్బందిపై కేసు నమోదు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘దివంగత మహానేత కలైంజర్‌ తనయుడిగా ఉన్నప్పటి నుంచి స్టాలిన్ నాకు బాగా తెలుసు. మా ఇద్దరి మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి కుమారుడు అనే సంతోషం ఎంతో ఉన్నప్పటికీ.. అంతకు మించిన కష్టాలు, సవాళ్ళు ఆయనకు ఉన్నాయి. ఒకవైపు సంతోషాన్ని అనుభవిస్తూనే మరొకవైపు కష్టాలను ఎదురీదుతూ అంచెలంచెలుగా ఒక కార్యకర్తగా, యువజన విభాగం అధ్యక్షుడిగా, శాసనసభ సభ్యుడిగా, మేయర్‌గా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, ఇపుడు ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు’’ అని అన్నారు.

Lok Sabha Secretariat: బీఆర్ఎస్‭కు షాక్ ఇచ్చిన లోక్‭సభ సచివాలయం

ఇంకా ఆయన మాట్లాడుతూ స్టాలిన్‌కు కేవలం సహనం, ఓర్పు మాత్రమే కాకుండా, ప్రతిభ కూడా పుష్కలంగా ఉందన్నారు. అప్పుడప్పుడు చరిత్రను జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన తరుణం ఉందని, ఈ చరిత్రను తిరగ రాయాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో డీఎంకేతో పొత్తుపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. కాకపోతే పొత్తు పెట్టుకునే ఆలోచన ఉన్నట్లు ఆయన సంకేతాలు ఇచ్చారు. క్రమక్రమంగా తమ స్నేహాన్ని బలోపేతం చేసుకుంటూ రాజకీయ మిత్రానికి వెళ్తామన్నట్లుగా కమల్ హాసన్ వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు