Konda Surekha
Telangana Cabinet Expansion: ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చింది. పలువురు కొత్త వాళ్లకు మంత్రివర్గంలో ఛాన్స్ దక్కనుంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు క్యాబినెట్ లో చోటు దక్కనున్నట్లుగా తెలుస్తోంది. ఆయనతో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి క్యాబినెట్ లో బెర్త్ ఖరారు కానున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డిలలో ఒకరికి ఛాన్స్ లభించే అవకాశం ఉంది. ఇక తరచూ వివాదాల్లో నిలుస్తున్న కొండా సురేఖను క్యాబినెట్ నుంచి తప్పించనున్నట్లు సమాచారం. కొండా సురేఖ సామాజికవర్గం నుంచి ఆది శ్రీనివాస్ కు అవకాశం కల్పించనున్నారు. జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.
మంత్రివర్గంలో ప్రస్తుతం ఆరు బెర్తులు ఖాళీలు ఉండగా నాలుగు బెర్తులను భర్తీ చేయనున్నట్లు టాక్. ఈసారి క్యాబినెట్ లో మాల, మాదిగ సామాజికవర్గాలకు ఛాన్స్ లేనట్లు తెలుస్తోంది. ఈ రెండు సామాజికవర్గాల మధ్య విబేదాలు ఉండటంతో అధిష్టానం హోల్డ్ లో పెట్టింది.
Also Read: బీఆర్‌ఎస్ నుంచి తనను బహిష్కరిస్తారన్న ప్రచారంపై కవిత స్పందన.. కేటీఆర్‌కు కౌంటర్.. సంచలన కామెంట్స్
దాదాపు ఏడాదిన్నర కాలంగా మంత్రివర్గ విస్తరణ కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. క్యాబినెట్ విస్తరణపై అనేక సమీక్షలు, సమావేశాలు జరిగాయి. అయినా ఈ వ్యవహారం కొలిక్కి రాక విస్తరణ అంశం వాయిదా పడుతూ వస్తోంది. ప్రధానంగా సామాజిక సమీకరణాలు సెట్ కాకపోవడం, కీలక నేతల మధ్య అభిప్రాయ బేధాలు ఉండటం వంటి కారణాలతో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తోంది. ఫైనల్ గా పార్టీ హైకమాండ్ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పార్టీ కమిటీలకు హైకమాండ్ ఆమోదం తెలిపింది.
మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉండగా.. 12మందికి పైగా రేసులో ఉన్నారు. గతంలో హామీలు పొందిన వారు, సీనియర్ నేతలు పదవి కోసం పోటీ పడుతున్నారు. జిల్లాల సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని పదవులు భర్తీ చేయాలన్నది హైకమాండ్ యోచన.