టీడీపీ-జనసేన కూటమిలోకి కమలం పార్టీ! బీజేపీకి కేటాయించే ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు ఇవే?

కొందరు రాష్ట్ర బీజేపీ నేతలు కూడా కూటమిలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఢిల్లీ పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాగానే.. మూడు పార్టీల మధ్య పొత్తుపై ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

BJP Likely To Join Tdp Janasena Alliance : సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న వేళ.. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తు రాజకీయాలు ఊపందుకున్నాయి. ఇన్నిరోజులు ఉప్పు నిప్పూలా ఉన్న టీడీపీ-బీజేపీ మధ్య సంబంధాలు మెరుగవుతున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి వెళ్లడం ద్వారా బీజేపీతో సత్సంబంధాలనే కోరుకుంటున్నట్లు చంద్రబాబు.. పవన్‌.. బీజేపీ కోసం ఇంకా తలుపులు తెరిచే ఉన్నట్లు సంకేతాలిచ్చినట్లు విశ్లేషిస్తున్నారు పరిశీలకులు.

ఢిల్లీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పొత్తుపై బీజేపీ ప్రకటన..!
గతంలో కూడా టీడీపీ-జనసేన కూటమితో చేతులు కలపాల్సిందిగా బీజేపీ పెద్దలను చాలాసార్లు కోరారు జనసేనాని పవన్‌. ఇక ఎన్నికలకు ఎన్నో రోజులు సమయం లేకపోవడం.. టీడీపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు వరకు పరిస్థితి రావడంతో ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకూడదని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. కొందరు రాష్ట్ర బీజేపీ నేతలు కూడా కూటమిలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఢిల్లీ పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాగానే.. మూడు పార్టీల మధ్య పొత్తుపై ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

Also Read : వైఎస్‌ కుటుంబంలో రాజకీయ యుద్ధం.. షర్మిలతో జగన్‌కు చిక్కులు తప్పవా?

పొత్తులో భాగంగా బీజేపీకి 5 ఎంపీ, 10 ఎమ్మెల్యే స్థానాలు?
అదే విధంగా టీడీపీ-జనసేన కూటమిలో చేరితే ఏయే స్థానాలు కోరాలి? ఎక్కడెక్కడ పోటీ చేయాలన్నదానిపైనా రాష్ట్ర బీజేపీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. 10 టీవీకి అత్యంత విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం.. బీజేపీకి 4 నుంచి 5 పార్లమెంట్‌ స్థానాలు, 8 నుంచి 10 అసెంబ్లీ స్థానాలను ఆఫర్‌ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ స్థానాలకు అభ్యర్థులను కూడా సిద్ధం చేసుకుంది బీజేపీ. ఏపీలో బీజేపీ పోటీ చేసే లోక్‌సభ, శాసనసభ స్థానాలు ఏవో? ఆయా స్థానాల్లో కమలనాథుల బలాబలాలేంటో ఇప్పుడు చూద్దాం..

బీజేపీకి కేటాయించే పార్లమెంటు స్థానాలు, అభ్యర్థులు..!
విశాఖపట్నం, రాజమండ్రి, రాజంపేట, తిరుపతి, నర్సాపురం

విశాఖపట్నం – జీవీఎల్‌ నరసింహరావు/ సీఎం రమేశ్‌
రాజమండ్రి – పురందేశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు
రాజంపేట – నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి / సత్యకుమార్‌
తిరుపతి – రత్నప్రభ, రిటైర్డ్‌ ఐఏఎస్‌

Also Read : బీజేపీకి బానిసలు.. సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్ షర్మిల

బీజేపీకి కేటాయించే అసెంబ్లీ స్థానాలు, అభ్యర్థులు..!
విశాఖ ఉత్తర – విష్ణుకుమార్ రాజు
విశాఖ తూర్పు నియోజకవర్గం – మాధవ్
రాజమండ్రి సిటీ నియోజకవర్గం – సోము వీర్రాజు
పి.గన్నవరం నియోజకవర్గం – మానేపల్లి అయ్యాజివేమ
కైకలూరు నియోజకవర్గం – కామినేని శ్రీనివాస్
తిరుపతి నియోజకవర్గం – భానుప్రకాశ్‌ రెడ్డి
మదనపల్లె నియోజకవర్గం – చల్లా నరసింహారెడ్డి,
శ్రీకాళహస్తి నియోజకవర్గం – కోలా ఆనంద్‌
గుంటూరు వెస్ట్‌ నియోజకవర్గం – వల్లూరి జయప్రకాష్ నారాయణ

 

ట్రెండింగ్ వార్తలు