హెలికాప్టర్ రెడీ : జగన్ సుడిగాలి ప్రచారం

  • Publish Date - March 14, 2019 / 08:18 AM IST

వైెెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ఎన్నికల ప్రచారం రూట్ మ్యాప్ సిద్ధం అయ్యింది. సుడిగాలి పర్యటన చేయనున్నారు. రూట్ మ్యాప్ ఖరారుతోపాటు ప్రత్యేక హెలికాప్టర్‌‌ సిద్ధం చేసుకున్నారు జగన్. ఆయా నియోజకవర్గాల్లో భారీ బహిరంగసభల్లో పాల్గొంటారు. మార్చి 16వ తేదీ ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించిన అనంతరం.. ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. జగన్‌కు సపోర్టుగా తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల కూడా ప్రచారం చేయనున్నారు. 
Read Also : టీడీపీలో సీటుపై ఫైటింగ్ : రాయపాటి రాజీనామా అంటూ ప్రచారం

ఏపీలో జరుగుతున్న ఈ ఎన్నికలను జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే ప్రజాసంకల్ప పేరిట పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. పోలింగ్‌కు 25 రోజులు మాత్రమే సమయం ఉండడంతో హెరికాప్టర్ రెడీ చేసుకున్నారు. మార్చి 16 నుంచి 20వ తేదీ వరకు రోజుకు మూడు బహిరంగసభల్లో పాల్గొంటారు. 20వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు రోజుకు 4 సభల్లో జగన్ పాల్గొంటారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి రోజుకు 5 సభల్లో పాల్గొనేలా వైసీపీ ప్లాన్ చేసింది. 
–  మార్చి 16వ తేదీ వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించిన అనంతరం పిడుగురాళ్లలో జగన్ మొదటిగా ప్రచారం చేస్తారు. 
–  మార్చి 17న ఉదయం నర్సీపట్నం, మధ్యాహ్నం భోగాపురం, సాయంత్రం అంబాజీపేటలో ప్రచారం నిర్వహిస్తారు. 
–  మార్చి 18న ఉదయం ఊర్వకల్లు, మధ్యాహ్నం రాయదుర్గం, సాయంత్రం రైల్వే కోడూరులో జగన్ ప్రచారం ఉంటుంది.