అమలు చేసే హామీలే మానిఫెస్టోలో పెడదాం :  జగన్ 

  • Publish Date - March 6, 2019 / 10:21 AM IST

హైదరాబాద్ : నూటికి నూరు శాతం అమలు చేసే వాటినే మ్యానిఫెస్టోలో పెట్టాలని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పార్టీ మానిఫెస్టో కమిటీకి సూచించారు.  పార్టీ మెనిఫెస్టో కమిటీతో ఆయన  బుధవారం సమావేశం అయ్యారు. కమిటీ ఛైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తో సహా 31 మంది కమిటీ సభ్యులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు.
Also Read : విధేయ రామ : సీటు రాకపోయినా జగన్ సైనికుడినే!

మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలపై జగన్ పలు సూచనలు చేశారు. నవరత్నాలు లోని 9 అంశాలు ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రముఖంగా పొందుపరచాలని జగన్ చెప్పారు. 14 నెలల పాటు సాగిన ప్రజా సంకల్పయాత్రలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మ్యానిఫెస్టోలో ఉండాలని జగన్ సూచించారు. 

జిల్లాల్లో జరిగిన సమావేశంలో వచ్చిన విజ్ఞప్తులు, ఫిబ్రవరి 26 న విజయవాడలో జరిగిన మ్యానిఫెస్టో కమిటీ సమావేశంలో వచ్చిన 300 కి పైగా విజ్ఞప్తులు పరిశీలించాలని  మేనిఫెస్టో కమిటీ నిర్ణయించుకుంది.  మార్చి 12వ తేదీన విజయవాడ పార్టీ కార్యాలయంలో మ్యానిఫెస్టో కమిటీ మరోసారి సమావేశం  కానుందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు.
Also Read : అమరావతిలో సొంతిల్లు : హ్యాపినెస్ట్-2కి బుకింగ్స్