Pawan Kalyan : టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే పోటీ- పొత్తులపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన

Pawan Kalyan : త్రిముఖ పోరులో బలి కావడానికి సిద్ధంగా లేను. కచ్చితంగా పొత్తు ఉంటుంది. 46శాతం ఓటింగ్ తీసుకుని రండి. అప్పుడే నేనే సీఎం.

Pawan Kalyan On Alliance : వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. పార్టీ శ్రేణులకు మరింత క్లారిటీ ఇచ్చేశారు. అన్నీ బాగుంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అంతేకాదు సీఎం సీటు గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాతే సీఎం సీటు గురించి మాట్లాడుకుందామన్నారు పవన్ కల్యాణ్. సీఎం ఎవరనేది ముఖ్యం కాదన్న పవన్.. ఇప్పుడున్న సీఎంను గద్దె దించడమే మనందరి లక్ష్యం అన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది బలాబలాలను బట్టి అప్పుడే నిర్ణయించుకుందామన్నాని పవన్ అన్నారు.

” గత ఎన్నికల్లో వచ్చిన 7 శాతం ఓట్లు తక్కువ కాదు. ప్రస్తుతం 14 నుండి 18 శాతం ఓటింగ్ ఉంది. కృష్ణా నుండి శ్రీకాకుళం వరకు 25 శాతం ఓటింగ్ ఉంది. గోదావరి జిల్లాల్లో 35 శాతం ఓటింగ్ ఉంది. ఈ బలం ప్రభుత్వాన్ని సాధించే బలం కాదు. ఇంకోసారి ఓడిపోవడానికి సిద్ధంగా లేను. కచ్చితంగా ప్రభుత్వం స్థాపించే తీరాలి.

Also Read..Pawan Kalyan : సీఎం పదవి, పొత్తులపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

త్రిముఖ పోరులో బలి కావడానికి సిద్ధంగా లేను. కచ్చితంగా పొత్తు ఉంటుంది. ఎన్నికల ఫలితాలు వచ్చాక సీఎం అవ్వాలా లేదా నిర్ణయిద్దాం. అనుకున్న స్థాయిలో ఓట్లు వస్తే అప్పుడు మాట్లాడటానికి మనకి హక్కు ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో మన ప్రత్యర్థి వైసీపీ. రాష్ట్రాన్ని అదోగతి పాలు చేసింది వైసీపీ. సీఎం జగన్ చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎందుకు? ఏ కులానికీ న్యాయం చెయ్యలేదు. జగన్ ను అధికారం నుండి తీసెయ్యాల్సిందే. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న వ్యక్తిని అధికారం నుండి తీసెయ్యాల్సిన బాధ్యత అందరిదీ.

Also Read..Andhra Pradesh: జీవో నంబరు 1ని కొట్టేసిన ఏపీ హైకోర్టు.. ఆ జీవోపై ఏమందంటే?

మళ్ళీ జగన్ సీఎం అయితే ఏపీ మళ్ళీ జీవితంలో కోలుకోదు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉంటుంది. సీఎం ఎవరవ్వాలి అనేది కాదు. ఉన్న సీఎంను తీసేయడమే లక్ష్యం. ఎన్నికల తర్వాత పొత్తులో పార్టీల బలా బాలాలను బట్టి సీఎం నిర్ణయం ఉంటుంది. సీఎం అవ్వాలంటే మీరంతా నన్ను సముచిత స్థానంలో ఉంచాలి. పొత్తుల నిర్ణయం సిద్ధమే. కానీ విధివిధానాలు ఇంకా చర్చించలేదు. సీఎం సీఎం అని అరవకండి. 46శాతం ఓటింగ్ తీసుకుని రండి. అప్పుడే నేనే సీఎం” అని పార్టీ మండల, డివిజన్ అధ్యక్షులతో జరిపిన సమావేశంలో పవన్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు