Pawan Kalyan : సీఎం పదవి, పొత్తులపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan : ఎన్నికల్లో ప్రభావితం చూపించగలగే పార్టీలు కలవాలి. వ్యతిరేక ఓటు చీలనివ్వను అనడానికి కారణం వైసీపీనే. 2014లో లోతుగా ఆలోచించి టీడీపీతో కలిశా.

Pawan Kalyan : సీఎం పదవి, పొత్తులపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan

Updated On : May 11, 2023 / 11:16 PM IST

Pawan Kalyan : ఏపీలో ఎన్నికల పొత్తులు, ముఖ్యమంత్రి అభ్యర్థి అంశాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం తాపత్రయ పడకూడదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. సీఎం పదవి అనేది వరించి రావాలి తప్ప, కోరుకుంటే వచ్చేది కాదన్నారు పవన్ కల్యాణ్. మన కష్టం మీదే ముఖ్యమంత్రి పదవి మనల్ని వరించాలి తప్ప మనం ఆ పదవి కోసం పాకులాడకూడదన్నారు పవన్ కల్యాణ్. పొత్తుల్లో సీఎం అభ్యర్థి కండీషన్ ఉండదని, రాష్ట్ర భవిష్యత్తు కండీషన్ మాత్రమే ఉంటుందని పవన్ తేల్చి చెప్పారు. కండీషన్లు పెట్టి ముఖ్యమంత్రి పదవి పొందలేము అన్నారు పవన్ కల్యాణ్.

ఇక, పొత్తులపైనా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుల విషయంలో తన స్టాండ్ మారలేదన్నారు పవన్ కల్యాణ్. పొత్తుల వల్లే బీఆర్ఎస్ లాంటి పార్టీలు బలపడ్డాయన్నారు. ఉనికి చాటుకునేందుకు పార్టీ పెట్టలేదన్న పవన్.. అసెంబ్లీలో బలమైన పార్టీగా ఉండాలనే పార్టీ పెట్టానని చెప్పారు. మన గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా పొత్తులు ఉంటాయని ఆయన తేల్చి చెప్పారు. ప్రజలకు అధికారం అప్పగించాలి, అదే మన లక్ష్యం అన్నారు పవన్ కల్యాణ్. మంగళగిరిలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. పొత్తులు, ముఖ్యమంత్రి అభ్యర్థిపై తన వైఖరిని ఖరాఖండిగా చెప్పేశారు.(Pawan Kalyan)

Also Read..Andhra Pradesh : ఏపీ ఆర్థిక పరిస్థితి‎పై కావాలనే తప్పుడు ప్రచారం : సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ

”ఎన్నికల్లో ప్రభావితం చూపించగలగే పార్టీలు కలవాలి. పొత్తుల వల్లే బీఆర్ఎస్ లాంటి పార్టీలు బలపడ్డాయి. వ్యతిరేక ఓటు చీలనివ్వను అనడానికి కారణం వైసీపీనే. ఒప్పుకోని పార్టీ ఉంటే ఒప్పిస్తా. 2014లో లోతుగా ఆలోచించి టీడీపీతో కలిశా. ప్రతికూల పరిస్థితుల్లో 7శాతం ఓట్లు సాధించాం అంటే మామూలు విషయం కాదు. 137 స్థానాల్లో పోటీ చేశాం. కొన్ని చోట్ల 30శాతం ఓట్లు మనకొచ్చాయి. సీఎం అభ్యర్థిగా ఉంటేనే పొత్తు ఉండాలని మా వాళ్ళకి ఇబ్బంది వచ్చింది.(Pawan Kalyan)

పొత్తులు.. కులానికి సంబంధించిన వ్యవహారం. కాదు రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని పొత్తులు ఉంటాయి. ముందస్తు ఎన్నికలు వస్తే జూన్ నుండి క్షేత్ర స్థాయిలో ఉంటా. మాకు పట్టున్న ప్రాంతాల్లో ప్రస్తుతం 37 శాతం ఓటింగ్ ఉంది. సీఎం పదవి అనేది వరించాలి తప్ప తాపత్రయ పడకూడదు. సీఎం పదవి మన కష్టం మీదే వరించాలి తప్ప పాకులాడకూడదు. పొత్తుల్లో సీఎం అభ్యర్థి కండీషన్ ఉండదు. రాష్ట్ర భవిష్యత్తు కండీషన్ మాత్రమే ఉంటుంది. నేను సంపూర్ణమైన రైతును.. మానవతా వాదిని. మీకు వ్యవసాయంపై సంపూర్ణమైన అవగాహన ఉంటే ఎందుకు రైతులను ఏడిపిస్తున్నారు..? మంత్రులు అవగాహన లేని మాటలు మాట్లాడకూడదు” అని పవన్ కల్యాణ్ అన్నారు.(Pawan Kalyan)

Also Read..Paritala Sriram : వైసీపీ నాయకుని ఇంటి కోసం అమాయకుడి గుడిసె కూల్చేస్తారా..? మా ప్రభుత్వం వచ్చాక మీ ఇంట్లోంచి రోడ్లు వేస్తాం జాగ్రత్త..

సీఎం పదవి అనేది వరించి రావాలి తప్ప, కోరుకుంటే వచ్చేది కాదంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పవన్ కామెంట్స్ తో జనసేన-టీడీపీ పొత్తు ఖాయమైనట్టే అనే అభిప్రాయం ఆయా పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.(Pawan Kalyan)