Andhra Pradesh : ఏపీ ఆర్థిక పరిస్థితి‎పై కావాలనే తప్పుడు ప్రచారం : సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ

ఏపీ ఆర్థిక పరిస్థితి‎పై తప్పుడు ప్రచారం జరుగుతోంది అంటూ ఏపీ ప్రభుత్వ ఆర్థిక సలహాదారు,సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ వెల్లడించారు.ఎవరికి పరిచయం లేని వ్యక్తిని ఆర్థిక వేత్తగా గుర్తించి వారి ద్వారా ప్రభుత్వంపై తప్పుడు సమాచారం ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందంటూ చెప్పుకొచ్చారు. ఆర్థిక అంశాల్లో మాట్లాడాలి అంటే అనుభవం ఉండాలని..అలాగే ఏదైనా ప్రత్యేక మైన కోర్సు అయినా చేసి ఉండాలని సున్నిత మైన అంశాల పై అపోహలు సృష్టించడం ఏమిటి ?అంటూ ప్రశ్నించారు.

Andhra Pradesh : ఏపీ ఆర్థిక పరిస్థితి‎పై  కావాలనే తప్పుడు ప్రచారం :  సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ

CM Jangan Special Secretary Duvvuri Krishna

Andhra Pradesh : ఏపీ ఆర్థిక పరిస్థితి‎పై తప్పుడు ప్రచారం జరుగుతోంది అంటూ ఏపీ ప్రభుత్వ ఆర్థిక సలహాదారు,సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ మీడియా సమావేశంలో వెల్లడించారు.ఎవరికి పరిచయం లేని వ్యక్తిని ఆర్థిక వేత్తగా గుర్తించి వారి ద్వారా ప్రభుత్వంపై తప్పుడు సమాచారం ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందంటూ చెప్పుకొచ్చారు. ఆర్థిక అంశాల్లో మాట్లాడాలి అంటే అనుభవం ఉండాలని..అలాగే ఏదైనా ప్రత్యేక మైన కోర్సు అయినా చేసి ఉండాలని సున్నిత మైన అంశాల పై అపోహలు సృష్టించడం ఏమిటి ?
అంటూ ప్రశ్నించారు.

ప్రజా ఆర్థిక అంశాలపై మాట్లాడే వ్యక్తులు అనుభవంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోందని.. ప్రభుత్వ అప్పు ఎంత అనేది ప్రశ్నార్థకం అయితే అది పూర్తిగా వెబ్ సైట్ లల్లో అందుబాటులో ఉందని తెలిపారు. అలాగే అప్రకటిత అప్పు అనేది ఉందన్నారు. రాష్ట్ర విభజన జరిగే సమయానికి రిజర్వు బ్యాంకు నివేదిక ప్రకారం రూ.1,96,202 కోట్లుగా ఉందని..ఈ నాలుగేళ్ల లో రూ. 4,42,442 కోట్ల రుణాలు ఉన్నట్టు అర్బీఐ చెప్పిందని తెలిపారు. ఇక ప్రభుత్వ హామీ ఇచ్చే రుణాలు తీసుకున్న కార్పొరేషన్లు తీసుకున్న అప్పు రూ. 1,44,875 కోట్లు రుణం ఉందని..అందులో విద్యుత్ సంస్థల రుణమే 45 వేల కోట్లు ఉందని తెలిపారు.

అప్పు చేయాలంటే ఏ రాష్ట్రమైనా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, లేదా బాండ్లు ద్వారా రుణం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. టీడీపీ ఎంపీ కనకమేదల అడిగిన సమాచారం మేరకు కేంద్రం ఇచ్చిన వివరాలు ప్రకారం కూడా ఏపీ అప్పు తక్కువే ఉందని తెలిపారు. ఏదో గుప్త రుణాలు ఉన్నట్టు ప్రతిపక్షాలు యాగి చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ గ్యారెంటీలు లేకుండా తీసుకున్న రుణం రూ.56,017 కోట్లు ఇక విద్యుత్ సంస్థలకు ట్రాన్స్ కో, జెంకో, దిస్కం లు తీసుకున్న అప్పు 64,472 కోట్లుగా ఉందన్నారు. గ్యారెంటీ లేకుండా అప్పులు తీసుకొని తీర్చే శక్తి పవర్ సెక్టార్ కు మాత్రమే ఉందని.. రెవెన్యూ ఎక్సెపెండేచర్ ఎప్పుడూ వృధా కాదన్నారు. ఎలక్షన్ స్టంట్ కోసం ఎక్ప్ పెండేచర్ చేస్తే అది తప్పు…క్యాపిటల్ ఎక్స్ పెండేచర్ తెలుగుదేశం పాలనలో 2014-15 నుండి 2018-19 వరకు మొత్తం 76,139 కోట్ల రూపాయలు..యావరేజ్ రూ.15,227 కోట్లు వుందని తెలిపారు. నీరు చెట్టు వంటి ప్రోగ్రాంలను కూడా క్యాపిటల్ ఎక్స్ పెండేచర్ లో కలిపారు ఇది తప్పు అని నేను అనటం లేదనీ.. ఈ ప్రభుత్వంలో 2019-20 నుండి 2022 – 23 ఇప్పటి వరకు క్యాపిటల్ ఎక్స్ పెండేచర్ రూ.75,411.19 కోట్ల రూపాయలు అనీ..యావరేజ్ 18,852.80 కోట్ల రూపాయలు వుందని..తేడా గమనిస్తే గత ప్రభుత్వ పాలన కంటే ఈ ప్రభుత్వ పాలనలో క్యాపిటల్ ఎక్స్ పెండేచర్ తగ్గలేదని స్పష్టం అవుతోందని వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కారణంగా క్యాపిటల్ ఎక్స్ పెండేచర్ తగ్గిందని..కోవిడ్ సంక్షోభం వల్ల రూ.66,116 కోట్ల రూపాయలు ఆదాయం కోల్పోయామని తెలిపారు. జీతాలు, పెన్షన్లు, బిల్లుల చెల్లింపులకోసం అప్పులు చేస్తున్నారని చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అని స్పష్టంచేశారు. అప్పులు చేసిన మొత్తాన్ని రకరకాలుగా ఖర్చు చేస్తారని… దేనికి ఖర్చు పెట్టింది ఎవ్వరూ చెప్పలేరని.. ఎవ్వరూ కనుక్కోలేరని అన్నారు. 2022 సెప్టెంబర్ 19 నాటికి పెండింగ్ బిల్స్ 21,700 కోట్లు ఉందని..ఇప్పుడు ఎంత వుందో చూడాలని తెలిపారు. గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ 7 – 8 సంవత్సరాలకు వుండేదని …. దానిని 12 – 13 సంవత్సరాలకు మార్చారని ఆరోపిస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వ బాండ్స్ 55 శాతం ఇలాగే వున్నాయని..కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిందని అనగలరా ? అని ప్రశ్నించారు.

వాహనమిత్ర ఇచ్చి ఫైన్ లు వేసి ప్రభుత్వం దండుకుంటోందని చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అని సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ కొట్టిపారేశారు. చంద్రబాబు పాలనలో 270.39 కోట్లు ఫైన్ లు వేస్తే మా ప్రభుత్వ పాలనలో 183.94 కోట్లు మాత్రమే ఫైన్ లు వేశారని తెలిపారు. చంద్రబాబు పాలనలోనే ఎక్కువ ఫైన్ లు వేశారని..మధ్యాహ్న భోజన పథకం కోసం టీడీపీ పాలనలో రూ.500 కోట్లు ఖర్చు పెడితే మా ప్రభుత్వం రెండింతలు అంటే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టిందని తెలిపారు. పెన్షన్ ల కోసం టీడీపీ ప్రభుత్వం 5,619 కోట్లు ఖర్చు పెడితే మా ప్రభుత్వం 17,600 కోట్లు ఖర్చు పెట్టిందని వెల్లడించారు. అప్పు తీర్చడం క్యాపిటల్ ఎక్స్ పెండేచర్ కాదని అన్నారు సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ.