Andhra Pradesh: జీవో నంబరు 1ని కొట్టేసిన ఏపీ హైకోర్టు.. ఆ జీవోపై ఏమందంటే?

Andhra Pradesh: ఈ జీవో చాలా అన్యాయమంటూ ఏపీలోని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే.

Andhra Pradesh: జీవో నంబరు 1ని కొట్టేసిన ఏపీ హైకోర్టు.. ఆ జీవోపై ఏమందంటే?

High Court

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఇరుకు రోడ్లలో సభలు, రోడ్ షోలను నియంత్రించేలా వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1పై ఇవాళ ఏపీ హైకోర్టు (High Court) తీర్పు వెలువరించింది. జీవో నంబరు 1 (GO No.1)ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ ఏడాది జనవరి 2న ఏపీ ప్రభుత్వం జీవో నంబర్ 1ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

దీన్ని సవాలు చేస్తూ అనేక వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిపై జనవరి 24న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర జస్టిస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపింది. ఇవాళ తీర్పు వెలువరించింది. GO No.1తో ప్రాథమిక హక్కులకు విఘాతమని హైకోర్టు తెలిపింది.

ఈ జీవో చాలా అన్యాయమంటూ ఏపీలోని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాలను అణచివేయడానికే ఈ జీవోను తీసుకువచ్చారని టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. జీవో నంబరు1పై పోరాడతామని అన్నారు.

కాగా, ప్రజల భద్రత దృష్ట్యా రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ జీవో నంబరు 1ని తీసుకొచ్చినట్లు ఏడాది జనవరి 2న ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీని ప్రకారం జాతీయ, రాష్ట్ర, మునిసిపల్, పంచాయతీరాజ్ రోడ్లపై సభలు, ర్యాలీలు నిర్వహించకుండా నిషేధం విధించింది. సభలు, ర్యాలీను ప్రజలకు ఇబ్బందు కలగని ప్రాంతాల్లోనే నిర్వహించుకోవాలని ఏపీ సర్కారు పేర్కొంది.

ఒక వేళ ఉల్లంఘిస్తే సభలు, ర్యాలీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. టీడీపీ నిర్వహించిన పలు సభల్లో తొక్కిసలాట చోటుచేసుకుని పలువురు మృతి చెందిన సమయంలో ఏపీ సర్కారు GO No.1ను తీసుకురావడం గమనార్హం.

ఈ తీర్పు ప్రజా విజయం: బీజేపీ
ప్రాథమిక హక్కులకు విఘాతంగా ఉన్న జీవో నెం.1ని కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు సభలు, రోడ్ షోలు, ర్యాలీలపై ప్రభుత్వం ఆంక్షలు విధించిందని ఆరోపించారు. ఈ తీర్పు ప్రజా విజయం అని ఆయన పేర్కొన్నారు.

Chandrababu : నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన