కాపు కులంలో పుట్టడం వల్లే.. జనసేన నేత భాస్కరరావు కంటతడి

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనకాపల్లిలో జనసేన పార్టీ బలోపేతానికి తాను కృషి చేసినట్లు తెలిపారు.

JanaSena Paruchuri Bhaskar Rao

JanaSena Paruchuri Bhaskar Rao : జనసేన అనకాపల్లి సమన్వయకర్త, ఎమ్మెల్యే టికెట్ ఆశావహుడు పరుచూరి భాస్కరరావు కంటతడి పెట్టారు. కాపు కులంలో పుట్టడం వల్లే తనకు సీటు రాలేదని కన్నీటి పర్యంతం అయ్యారాయన. పొత్తులో భాగంగా అనకాపల్లి సీటు జనసేనకు రావడం సంతోషంగా ఉందన్న ఆయన.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనకాపల్లిలో జనసేన పార్టీ బలోపేతానికి తాను కృషి చేసినట్లు తెలిపారు. తనకు సీటు రాకపోవడానికి కారణం కాపు కులంలో పుట్టడమే అని ఆయన వాపోయారు.

భాస్కరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఒక్కసారిగా ఎమోషన్ అయ్యారు. జనసేన టికెట్ తనకు దక్కకపోవడంతో ఆయన తీవ్ర ఆవేదన చెందారు. ఒకానొక సమయంలో బాగా ఎమోషన్ అయ్యి కంటతడి పెట్టేసుకున్నారు. ఆయన అనుచరులు సైతం కన్నీటిపర్యంతం అయ్యారు.

టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా అనకాపల్లి అసెంబ్లీ టికెట్ జనసేనకు కేటాయించారు చంద్రబాబు. అనకాపల్లి జనసేన అభ్యర్థిగా కొణతాల రామకృష్ణను ప్రకటించారు పవన్ కల్యాణ్. అనకాపల్లి జనసేన టికెట్ పై ఆ పార్టీ కోఆర్డినేటర్ భాస్కరరావు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కచ్చితంగా టికెట్ తనకు దక్కుతుందని భావించారు. అయితే, ఆ టికెట్ ను కొణతాలకు కేటాయించడంతో భాస్కరరావు తీవ్ర నిరాశ చెందారు.

Also Read : ఎవరికి ఎవరు పోటీ? టీడీపీ-జనసేన కూటమి, వైసీపీ అభ్యర్థుల బలాబలాలు ఇవే..