వైసీపీలో చేరిన కారెం శివాజీ

ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ కారెం శివాజీ వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు.

  • Published By: veegamteam ,Published On : November 29, 2019 / 12:39 PM IST
వైసీపీలో చేరిన కారెం శివాజీ

Updated On : November 29, 2019 / 12:39 PM IST

ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ కారెం శివాజీ వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు.

ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ కారెం శివాజీ వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. కారెం శివాజీకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటివరకు కారెం శివాజీ టీడీపీలో కొనసాగారు. గత ప్రభుత్వ పాలనలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా పని చేశారు. ఇటీవలే శివాజీ తన పదవికి రాజీనామా చేశారు. 

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కారెం శివాజీ ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ గా నియమితులైన అనంతరం ఆయనను న్యాయపరమైన వివాదాలు వెంటాడాయి. కారెం శివాజీని ఎస్సీ, ఎస్టీ ఛైర్మన్ గా నియమించడాన్ని కోర్టు తప్పుపట్టింది. న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తూ..పదవిలో కొనసాగారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం మారింది. జగన్ సీఎం అయ్యారు. ఆ తరువాత కూడా శివాజీ అదే పదవిలో కొనసాగారు. గురువారం శివాజీ తన పదవికి రిజైన్ చేశారు. 

కారెం శివాజీ సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో జేఏసీ నేతలతో కలిసి పనిచేశారు. ఆ తరువాత టీడీపీకి ఫేవర్ గా పని చేశారు. దీంతో అప్పటి సీఎం చంద్రబాబు.. కారెం శివాజీకి ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా నియమించారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై కారెం శివాజీ పలు విమర్శలు చేశారు.