Delhi Liquor Scam: మనీశ్ సిసోడియా అరెస్ట్ మీద సీబీఐ అధికారులే వ్యతిరేకంగా ఉన్నారట

లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఆయనను ఆదివారం ఉదయం నుంచి సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మనీష్ సిసోడియాను అనేక అంశాలపై సీబీఐ ప్రశ్నించింది. లిక్కర్ పాలసీ, ముడుపులు, టెండర్ల వ్యవహారంపై అనేక ప్రశ్నలు సంధించింది

Delhi Liquor Scam: డిప్యూటీ ముఖ్యమంత్రి, తన కొలీగ్ మనీశ్ సిసోడియాను రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే అరెస్ట్ చేశారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. నిజానికి సీబీఐ అధికారులెవరికీ సిసోడియాను అరెస్ట్ చేయాలని లేదని, కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి మేరకే అలా చేయాల్సి వచ్చిందని అన్నారు. ఈ విషయమై ఆయన సోమవారం సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ “చాలా మంది సిబిఐ అధికారులు మనీష్ అరెస్టును వ్యతిరేకిస్తున్నారని నాకు చెప్పారు. వారందరికీ అతనిపై అపారమైన గౌరవం ఉంది. పైగా సిసోడియాకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవు. కానీ అతనిని అరెస్టు చేయాలని రాజకీయ ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. వారు తమ రాజకీయ గురువులకు కట్టుబడి ఉండాల్సి వచ్చింది” అని కేజ్రీవాల్ అన్నారు.

Vivek Venkataswamy: మనీష్ సిసోడియా తరహాలోనే త్వరలో ఎమ్మెల్సీ కవిత అరెస్టు: మాజీ ఎంపీ వివేక్

ఆప్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. కేజ్రీవాల్ చెప్పింది వాస్తవమేనని, సీబీఐలో ఉన్న సీనియర్ అధికారుల నుంచి తనకు కూడా కచ్చితమైన సమాచారం వచ్చిందని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందని, ఇది ఎమర్జెన్సీ లాంటి పరిస్థితని అన్నారు. అయితే కేంద్రం చర్యల్ని సీబీఐలో ఉన్న ఆలోచనపరులు వ్యతిరేకిస్తున్నారని, కారణం మోదీ శాశ్వతం కాదని వారి తెలుసని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘మోదీజీకి అరవింద్ కేజ్రీవాల్ అంటే భయం.. రాహుల్ గాంధీకి గానీ, మరే ఇతర నాయకుడికి గానీ భయం లేదు. కేవలం అరవింద్ కేజ్రీవాల్‌కే భయపడతారు. ఆప్ పాపులారిటీ పెరిగే కొద్దీ ఆ భయం ఎక్కువ అవుతోంది” అని అన్నారు.

Shivmogga Airport: శివమొగ్గ ఎయిర్‭పోర్ట్ ప్రారంభించిన ప్రధాని మోదీ

మనీశ్ సిసోడియా అరెస్టును వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ అరెస్టును నిరసిస్తూ ఆప్ బ్లాక్ డేకి ఆప్ పిలుపిచ్చింది. ఈ మేరకు ఢిల్లీ, చండిఘడ్, భోపాల్, హైదరాబాద్, కర్ణాటకలోని బెంగుళూరు, ఏపీలోని తిరుపతిలో ఆప్ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. అందులో భాగంగా బీజేపీ కార్యాలయాల ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న ఆప్ కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Uttar Pradesh: ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితుడు ఎన్‭కౌంటర్‭లో హతం

లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఆయనను ఆదివారం ఉదయం నుంచి సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మనీష్ సిసోడియాను అనేక అంశాలపై సీబీఐ ప్రశ్నించింది. లిక్కర్ పాలసీ, ముడుపులు, టెండర్ల వ్యవహారంపై అనేక ప్రశ్నలు సంధించింది. దాదాపు ఎనిమిది గంటలపాటు సాగిన విచారణ అనంతరం, ఆదివారం సాయంత్రం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆయనను అరెస్టు చేశారు.

ట్రెండింగ్ వార్తలు