జూనియర్ ఎన్టీఆర్‌కు పిల్లని ఇచ్చిన మామ నార్నె శ్రీనివాసరావుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి లభించింది. ఇటీవల జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న నార్నె శ్రీనివాసరావుకు జగన్ ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర పాలక మండలి (సీజీసీ) సభ్యునిగా నియమించారు. ఈ విషయాన్ని వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనయుడు దగ్గుబాటి హితేష్ కూడా వైఎస్సార్ సీపీలో చేరిన సంగతి తెలిసిందే.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో అవినాభవ సంబంధం ఉన్న నార్నే శ్రీనివాసరావు బంధాన్ని వదిలి.. జగన్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందంటూ ఫిబ్రవరి 28న ఆయన వైసీపీలో చేరగా.. చంద్రబాబు పాలన బాగా లేదనే ఉద్దేశ్యంతో పార్టీ మారినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే వైసీపీలో చేరిన నార్నె శ్రీనివాసరావుకు ఆ పార్టీ తరపున చిలకలూరిపేట టికెట్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.