Kishan Reddy : ఒక్క రూపాయి అవీనితి లేకుండా పాలన చేస్తున్నారు, మోదీ లాంటి నాయకుడిని మళ్లీ గెలిపించుకోవాలి- కిషన్ రెడ్డి

మన్మోహన్ హయాంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగింది. మన్మోహన్ సింగ్ క్యాబినెట్‌లోని మంత్రులు జైలుకు వెళ్ళిన పరిస్థితి ఉంది.

Kishan Reddy

Kishan Reddy : విజయ సంకల్ప యాత్రలో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యాత్ర చేశారు. ఖైరతాబాద్ లోని బడే గణేశ్ వినాయకుని వద్ద బహిరంగ సభలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఏప్రిల్ మెుదటి వారంలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయని ఆయన తెలిపారు. ఎవరి నేతృత్వంలో మన పిల్లల భవిష్యత్, దేశ భవిష్యత్ బాగుంటుందో.. ప్రపంచంలో మన దేశ ప్రతిష్టను పెంచుతారో వారే ప్రధానిగా ఎన్నిక కావాల్సిన అవసరం ఉందన్నారు కిషన్ రెడ్డి.

మన్మోహన్ సింగ్ క్యాబినెట్‌లోని మంత్రులే జైలుకు వెళ్ళిన పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో రూ.12 లక్షల కోట్ల అవీనితి జరిగిందని ఆయన ఆరోపించారు. అనాడు సోనియా రిమోట్ కంట్రోల్‌లో మన్మోహన్ సింగ్ పనిచేశారని చెప్పారు. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ మన్మోహన్ సంతకం పెట్టేవాడన్నారు. మన్మోహన్ హయాంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. దీంతో స్థిరమైన ప్రభుత్వం, బలమైన నాయకుడిని కావాలని దేశ ప్రజలు కోరుకున్నారని, అలా 2014లో మోదీని ప్రధానిగా ఎన్నుకున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.

”గుజరాత్‌ లో మోదీ చేసిన అభివృద్దిని చూసి ప్రజలు మోదీని కావాలనుకున్నారు. ఒక్క రూపాయి అవీనితి లేకుండా మోదీ పాలనను కొనసాగిస్తున్నారు. మోదీ పాలనలో ఏ మంత్రి కూడా అవీనితికి పాల్పడలేదు. అవినీతి లేని పాలన అందిస్తామని మోదీ గ్యారంటీ ఇచ్చారు అదే విదంగా పాలన సాగుతుంది. 2014లో 278 సీట్లు వస్తే.. 2019లో బీజేపీకి 302 సీట్లు వచ్చాయి.

కరోనా, ఆర్టికల్ 370, త్రిపుల్ తలాక్ లాంటి సమస్యను పరిష్కరించారు. రామ మందిరం నిర్మాణంలో మోదీ సమర్ధవంతంగా పని చేశారు. ప్రపంచమంతా ఆకర్షించేలా స్థిరమైన పాలన చేశారు. మోదీ గొప్ప లీడర్‌ని అని ప్రపంచంలో అన్ని సర్వేలు వివరిస్తున్నాయి. 70శాతం ఓట్లతో ప్రపంచంలో నెం 1 నాయకుడిగా మోదీ ఉన్నారు. ఏప్రిల్ లో జరిగే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుంది. దీనికి తెలంగాణ ప్రజల భాగస్వామ్యం కావాలి.

మోదీ లాంటి గొప్ప నాయకుడిని మనం మళ్లీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క ఎంపీ సీటు గెలవకున్నా నష్టం లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్క స్థానం గెలిచినా అది వృథానే. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ఆరు గారడీలు చేసింది. ఆరు గ్యారంటీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారు? మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2500 ఎప్పటి నుంచి ఇస్తారు? ఆరు గ్యారెంటీలు అయ్యేది కాదు.. పోయేది కాదు” అని కిషన్ రెడ్డి అన్నారు.

Also Read : 10మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్ రెడీ? ఎంపీ అభ్యర్థులు వీళ్లే?

ట్రెండింగ్ వార్తలు