ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మంగళవారం 17 బిల్లులపై చర్చ జరిగింది. వీటిలో 15 బిల్లులను మండలి ఆమోదించింది. శాసన మండలిలో ఏపీ షెడ్యూల్ కులాల సవరణ బిల్లులో క్లాజ్ 12బిని సవరించాలని టీడీపీ సభ్యుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రతిపాదించారు.
క్లాజ్ 12బికి సవరణ ఆమోదం కోసం టీడీపీ సభ్యులు పట్టు పట్టి.. ఓటింగ్ కోసం డిమాండ్ చేశారు. అయితే శాసనమండలిలో టీడీపీ సభ్యులు అధిక సంఖ్యలో ఉండటంతో క్లాజ్ 12బి సవరణకు ఆమోదం అభించింది. తర్వాత బిల్లును మండలి ఆమోదించింది.
ఎస్సీల్లోని అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా చూడాలని సవరణ ప్రతిపాదన.. ఏబీసీడీ వర్గీకరణకు ఈ సవరణ అనుకూలంగా ఉందని వాదోపవాదాలు జరిగాయి. కాగా ఈ బిల్లు మరోసారి అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉంది.