Ktr slams modi: ఎన్ని వైద్య కాలేజీలు మంజూరు చేశారో చెప్పాలి: ప్రధాని మోదీపై కేటీఆర్ ఆగ్రహం

 కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు నరేంద్ర మోదీ ఎన్ని వైద్య కాలేజీలు మంజూరు చేశారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం తెలంగాణలో వైద్య విద్య విషయంలో ఎన్నో నిర్ణయాలు తీసుకుందని అన్నారు. మహబూబ్ నగర్ వైద్య కాలేజీ నిర్మాణం పూర్తి కావచ్చిందని, వనపర్తి, రామగుండం, జగిత్యాలలో నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు.

Ktr slams modi: కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు నరేంద్ర మోదీ ఎన్ని వైద్య కాలేజీలు మంజూరు చేశారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం తెలంగాణలో వైద్య విద్య విషయంలో ఎన్నో నిర్ణయాలు తీసుకుందని అన్నారు. మహబూబ్ నగర్ వైద్య కాలేజీ నిర్మాణం పూర్తి కావచ్చిందని, వనపర్తి, రామగుండం, జగిత్యాలలో నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు.

అంతేగాక, త్వరలోనే తాము కొత్తగూడెం వైద్య కాలేజీ ప్రారంభించనున్నట్లు కేటీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం వైద్య కాలేజీలను మంజూరు చేయడం లేదని విమర్శించారు. వైద్య విద్యలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్ర లిఖించారని ఆయన చెప్పారు. 2014కి ముందు 5 ప్రభుత్వ వైద్య కాలేజీలే ఉన్నాయని తెలిపారు. ఎనిమిది ఏళ్ళలో 16 కొత్త వైద్య కాలేజీలు మంజూరు చేశారని ఆయన అన్నారు. తాము మరో 13 కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

Chinese construction work: మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న చైనా.. అరుణాచల్‌ ప్రదేశ్‌లో నిర్మాణాలు?

ట్రెండింగ్ వార్తలు