Peddireddy Ramachandra Reddy Sensational Allegations
Peddireddy Ramachandra Reddy : కాంగ్రెస్ పార్టీపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరా రెడ్డిలపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీని చంపింది వాళ్లిద్దరే అని ఆయన విరుచుకుపడ్డారు. అనంతపురము జిల్లా రాప్తాడులో సిద్ధం సభ ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డిపై మంత్రి పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు.
కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డి లాంటి ముఠాలు కాంగ్రెస్ లో చాలా ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి మడుగులు వత్తి, అయన చనిపోయాక వైఎస్ జగన్ పై విరుచుకుపడ్డారు. మా ఇంఛార్జి మంత్రిగా ఉండి, కనీసం నా నియోజకవర్గంలో కూడా పర్యటించ లేదు. రఘువీరారెడ్డికి నా గురించి ఏం తెలుస్తుంది? నేను ఖూనీలు చేశాను అని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పకుంటా. పుట్టపర్తి సాయిబాబా చనిపోతే అయన పార్థివ దేహాన్ని తీయకుండా డబ్బుల మూటలు సర్దుకున్న వ్యక్తి రఘువీరారెడ్డి. రఘువీరా రెడ్డి ఒక పొలిటికల్ బ్రోకర్.
Also Read : పిఠాపురం సీటు ఎందుకంత హాటు? గెలుపుపై పార్టీల ధీమా వెనుక కారణమేంటి
కాంగ్రెస్ పార్టీని నేను బతికించా. కాంగ్రెస్ ను చంపింది కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డిలే. లక్షల కోట్లు అప్పులు చేసి చంద్రబాబు ఒక్క చెప్పుకోదగ్గ పథకం అయినా పెట్టారా? 14ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా.. నేను ఇది చేశాను.. అని చెప్పుకోవడానికి చంద్రబాబుకు ఏమీ లేదు. ఈసీకి నాపై ఫిర్యాదు చేయడం వల్ల నాకేం నష్టం లేదు. ముందు చంద్రబాబును కుప్పంలో గెలవమని చెప్పండి” అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
Also Read : సొంత జిల్లాలో బొత్సకు షాక్? వైసీపీకి దూరమవుతున్న ప్రధాన అనుచరులు..!