జవాన్లకు సంతాపం : ఉగ్రవాదుల దాడిని ఖండించిన జగన్ 

  • Publish Date - February 15, 2019 / 07:04 AM IST

హైదరాబాద్: జమ్మూకాశ్మీర్‌, పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిని వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిని పిరికిపందల చర్యగా ఆయన అభివర్ణించారు. మరణించిన జవాన్లకు సంతాపం ప్రకటించారు. వీర సైనికులకు జగన్ సంఘీభావం ప్రకటించారు.  ఉగ్రవాదుల దాడిలో మరణించిన అమర సైని​కుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని జగన్‌ ఆకాంక్షించారు.

పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 44 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని తామే చేశామని పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌ ప్రకటించుకుంది.