నిండుకుండలా నాగార్జున సాగర్ జలాశయం

  • Publish Date - November 10, 2019 / 05:41 AM IST

ఎగువనుంచి కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. అక్కడి నుంచి విడుదలవుతున్న భారీ నీటితో నాగార్జున సాగర్‌కు వరద పోటెత్తింది. నిండుకుండలా తయారైన సాగర్‌ నీటితో కళకళలాడుతోంది. అధికారులు నాగార్జునసాగర్‌ 4 క్రస్ట్‌ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

నాగార్జున సాగర్‌ ఇన్‌ఫ్లో 62,144 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 62,144క్యూసెక్కులుగా ఉంది. కొత్తగా వచ్చి చేరిన నీరు అంతే మొత్తంలో దిగువకు విడుదలవుతోంది. నాగార్జున సాగర్‌ పూర్తిస్తాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం కూడా అంతే మొత్తంలో(590 అడుగులు) ఉందని అధికారులు వివరించారు.