రేపు అమరావతికి నిజ నిర్ధారణ కమిటీ

  • Publish Date - January 10, 2020 / 11:22 AM IST

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని…. రాజధానిని తరలించవద్దంటూ తుళ్లూరు, మందడం గ్రామాల్లో నిరసన ప్రదర్శన చేస్తున్న  మహిళా రైతులపై పోలీసులు దాడి చేసిన ఘటనను జాతీయ మహిళా కమీషన్ సుమోటోగా స్వీకరించింది. శనివారం నిజ నిర్ధారణ కమిటీని అమరావతికి పంపుతామని జాతీయ మహిళా కమీషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ ట్విట్టర్ లో తెలిపారు.

Also Read : పోలీసుల అదుపులో నారా లోకేష్

రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాలలో   గడిచిన 24 రోజులుగా నిరసన తెలుపుతున్న మహిళల పట్ల పోలీసులు  వ్యవహరిస్తున్న తీరుపై  మహిళలు ట్విట్టర్ ద్వారా, ఆన్ లైన్ ద్వారా జాతీయ మహిళా కమీషన్ కు  చేసిన ఫిర్యాదుపై  రేఖాశర్మ స్పందించారు. నిజ నిర్ధారణ కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం తదుపరి  చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కోన్నారు. 

మరోవైపు  శుక్రవారం  విజయవాడ బందరు రోడ్డులో  మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు.  పోలీసు ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ  భారీ సంఖ్యలో మహిళలు బందరు రోడ్డుకు చేరుకున్నారు.  బెంజి సర్కిల్ నుంచి ర్యాలీగా బయలుదేరిన మహిళలను  పిడబ్యూడీ గ్రౌండ్స్ వద్ద పోలీసులు మహిళలను అడ్డుకోవటంతో ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. దాదాపు 20 వేల మంది మహిళలు ర్యాలీకి హాజరైనట్లు తెలుస్తోంది. 
 

ట్రెండింగ్ వార్తలు