Bihar Politics: మంత్రి గొంతు పట్టుకున్న సీఎం.. ఆ తర్వాత సీఎం చేసిన పనికి అక్కడున్న వాళ్లంతా నవ్వులు
వాస్తవనానికి నూతన వాక్సీన్ విధానం గురించి మీడియా ప్రశ్నించిన సందర్భంలో ఇది జరిగింది. అనంతరం తన మంత్రిని కౌగిళించుకున్నారు నితీశ్

Nitish Kumar: ‘మంత్రి గొంతు పట్టుకున్న’ అనగానే అదేదో సీరియస్ మ్యాటర్ అనుకోకండి సుమా.. నిజానికి ఇదో సరదా సన్నివేశం. రాజకీయ నాయకులైనంత మాత్రాన కొన్ని సరదాలకు అతీతం కాదు కదా.. సమయం దొరికినప్పుడు తమ మిత్రులతో కాసేపు సరదాగా ఉంటారు. అందరిలాగే కొన్ని మాటలు విసరడం, కొంత భౌతికపరమైన సంభాషణలు కూడా ఉంటాయి. తాజాగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ఇలాంటి సరదా సంభాషణ చేశారు.
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఓ కార్యక్రమం అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ మంత్రి అశోక్ చౌదరి నుదిటిపై మరొక మంత్రి నుదిటితో కొట్టారు. వాస్తవనానికి నూతన వాక్సీన్ విధానం గురించి మీడియా ప్రశ్నించిన సందర్భంలో ఇది జరిగింది. అనంతరం తన మంత్రిని కౌగిళించుకున్నారు నితీశ్. నూతన వ్యాక్సిన్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించగా? అలా ఏం కాదని సమాధానం చెప్పారు. అనంతరం అక్కడే ఉన్న మంత్రి అశోక్ చౌదరి మెడ పట్టుకుని నవ్వుతూ అక్కడే ఉన్న మరొక మంత్రి విజయ్ చౌదరి నుదిటికి తాకించారు. అప్పటికే అక్కడే ఉన్న ఉప ముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్ సహా ఇతర నేతలు నవ్వుతున్నారు. అనంతరం అశోక్ చౌదరిని దగ్గరికి తీసుకుని కౌగిళించుకున్నారు.