Karnataka CM: సిద్ధూ కాదు డీకే కాదు.. కర్ణాటక ముఖ్యమంత్రిగా మూడో వ్యక్తి?

దక్షిణ కర్ణాటకలో రాజకీయంగా అత్యంత పట్టున్న వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన నేత డీకే శివకుమార్. ఇక మధ్య కర్ణాటకతో పాటు ఉత్తర కర్ణాటకలో విస్తృతంగా ఉన్న వునుకబడిన సామాజికవర్గమైన కురుబ వర్గానికి చెందిన వ్యక్తి సిద్ధరామయ్య.

Karnataka Politics: కాంగ్రెస్ పార్టీ ముందుగా నిర్ణయించినట్లు జరిగితే గురువారం కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయాలి. అనుకున్నట్లుగా జరిగితే మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి ప్రకటన జరగాలి. ఇప్పటికే సీనియర్ నేత సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్రమైన పోటీ కొనసాగుతోంది. ఈ ఇద్దరిలో ఎవరు కాబోయే ముఖ్యమంత్రి అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతలో వీరిద్దరూ కాకుండా మూడో వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలంటూ డిమాండ్లు వస్తున్నాయి.

KTR America Tour : ప్రపంచానికి ‘నీటి పాఠాలు’ చెప్పటానికి అమెరికాకు మంత్రి కేటీఆర్ పయనం

ముఖ్యమంత్రి పదవి కోసం వివిధ కుల సమూహాల నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. కర్ణాటక రాజకీయాల్ని ఏలుతున్న లింగయత్ సమాజిక వర్గం నుంచి ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున 34 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. దీంతో తమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రి చేయాలని లింగాయత్ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అఖిల భారత వీరశైవ మహాసభ అత్యున్నత సభ డిమాండ్ చేస్తోంది. ఈ విషయమై ఏఐసీసీకి లేఖ రాసింది. చాలా రోజులుగా బీజేపీకి కీలక మద్దతుగా ఉన్న లింగాయత్ ఓటర్లు తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ వైపుకు బాగానే వచ్చారు. అయితే సగానికి పైగా ఇప్పటికీ బీజేపీకి గట్టి మద్దతుదారుగా ఉన్నారు.

Chandrababu Tour: 17 నుంచి ఆ మూడు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన.. రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గోనున్న టీడీపీ అధినేత

ఇక దళితుడిని ముఖ్యమంత్రి చేయాలని రాష్ట్రంలో ఏనాటి నుంచో ఉన్న డిమాండ్. దళిత నేతను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత జీ.పరమేశ్వర మద్దతుదారులు ప్రదర్శన నిర్వహించారు. తుమకూరులో జరిగిన సభలో ‘దళితుడు సీఎం కావాలి’ అని రాసి ఉన్న ప్లకార్డులు చేతబట్టారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల్లో జీ.పరమేశ్వర్ ఒకరు. పైగా గతంలో ఆయన ఉపముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గే దళిత సమాజికవర్గానికి చెందిన నేత, పైగా కర్ణాటకకు చెందిన వ్యక్తే. గతంలో ఈయనకు ముఖ్యమంత్రి పదవి రావాల్సి ఉందని, అయితే రాలేదని దళిత నాయకులు చెబుతున్నారు.

YS Sharmila: డీకే శివకుమార్‌ను ఎందుకు కలవాల్సి వచ్చిందో చెప్పిన షర్మిల..

దక్షిణ కర్ణాటకలో రాజకీయంగా అత్యంత పట్టున్న వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన నేత డీకే శివకుమార్. ఇక మధ్య కర్ణాటకతో పాటు ఉత్తర కర్ణాటకలో విస్తృతంగా ఉన్న వునుకబడిన సామాజికవర్గమైన కురుబ వర్గానికి చెందిన వ్యక్తి సిద్ధరామయ్య. ఖర్గే దళిత సామాజిక వర్గానికి చెందిన వారు. రాష్ట్రంలో దళిత జనాభా కూడా గణనీయంగా ఉంది. రాజకీయంగా ఓట్ల పరంగా బలంగా ఉన్న సామాజికవర్గం నుంచి బలమైన నేతలు ఉండడం వల్లే కాంగ్రెస్ పార్టీ గెలుపు సుగమమైందని అంటున్నారు. అయితే ముఖ్యమంత్రిని ఎవరు చేస్తారనేది మాత్రం ప్రమాణ స్వీకారం సమయం వరకు తెలిసేలా లేదు. అందరూ అనుకుంటున్నట్లు సిద్ధూ, డీకేల్లో ఒకరిని చేస్తారా? లేదంటే కొత్త వారికి అవకాశం ఇస్తారా చూడాలి.

ట్రెండింగ్ వార్తలు